బెల్లంకొండ 'చత్రపతి' తల్లి ఈమెనా?

Sat Dec 05 2020 14:05:15 GMT+0530 (IST)

Shefali Shah As Bellamkonda Srinivas Mother In Chatrapathi Remake

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'చత్రపతి' సినిమా సెన్షేషనల్ సక్సెస్ దక్కించుకుంది. ఆ సినిమా ప్రభాస్ స్టార్ డంను అమాంతం పెంచింది అనడంలో సందేహం లేదు. రాజమౌళితో పాటు ప్రభాస్ ను స్టార్స్ గా నిలిపిన చత్రపతి సినిమాను ప్రస్తుతం బాలీవుడ్ లో బెల్లంకొండ.. వివి వినాయక్ లు రీమేక్ చేసేందుకు సిద్దం అవుతున్నారు. మొదట ఈ వార్తలు పుకార్లు అనుకున్నారు. కాని ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాను రూపొందించబోతున్నట్లుగా చెబుతున్నారు. చత్రపతిలో అమ్మ భానుప్రియ మరియు తమ్ముడు షఫి పాత్రలు ఎంతో కీలకం. ఇప్పుడు ఆ పాత్రలను హిందీలో ఎవరు చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది.మదర్ సెంటిమెంట్ ను రీమేక్ లో రిపీట్ చేసేందుకు సీనియర్ స్టార్ నటిని ఆ పాత్ర కోసం ఎంపిక చేసే విషయమై చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన షెఫాలీ షా ను అమ్మ పాత్ర కోసం ఎంపిక చేయబోతున్నారట. సీరియల్స్ మరియు సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్న ఆమెను బెల్లంకొండకు మదర్ గా నటింపజేయడం వల్ల సినిమా వెయిట్ తప్పకుండా పెరుగుతుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. ఈమెకు వెబ్ సిరీస్ ద్వారా కూడా మంచి పేరు వచ్చింది. త్వరలోనే ఈమెను హిందీ చత్రపతికి ఎంపిక చేసినట్లుగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక షఫీ పాత్రకు గాను ప్రముఖ యంగ్ నటుడిని ఎంపిక చేసే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది.