ఈమె ఇస్మార్ట్ బ్యూటీ కాదు.. తెలివి తక్కువ బ్యూటీ!?

Sat Jul 02 2022 05:00:02 GMT+0530 (IST)

She is not a smart beauty

ఇస్మార్ట్ శంకర్ సినిమా తో హీరోయిన్ లుగా నిధి అగర్వాల్ మరియు నభా నటేష్ లకు మంచి గుర్తింపు దక్కింది. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో ఇద్దరు ముద్దుగుమ్మలకు కూడా మంచి ఆఫర్లు తలుపు తట్టాయి. హీరోయిన్స్ గా ఇద్దరికి మంచి ఆఫర్లు వస్తాయి అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా కరోనా వల్ల షూటింగ్స్ గందరగోళం అయ్యి ఆఫర్లు ఆశించిన స్థాయిలో రాలేదు.ఇస్మార్ట్ బ్యూటీ లు ఇద్దరు కూడా మళ్లీ గాడిన పడుతున్నారు అనుకుంటున్న సమయంలో నభా నటేష్ కనిపించకుండా పోయింది. నిధి అగర్వాల్ ఏదో ఒక భాష లో సినిమాలు చేస్తూ ఉంది కాని నభా నటేష్ మాత్రం ఎక్కువ సినిమా ల్లో కనిపించడం లేదు. అసలు ఈమద్య కాలంలో ఈ అమ్మడు ఏ ఒక్క సినిమాకు కమిట్ అయిన దాఖలాలు కనిపించక పోవడం ఆశ్చర్యకరం.

ఈ సమయంలో నభా నటేష్ గురించిన ఒక విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. నభా నటేష్ పారితోషికం అధికంగా డిమాండ్ చేస్తున్న కారణంగానే ఆమె వద్దకు వచ్చిన ఆఫర్లు కూడా ఓకే అవ్వడం లేదట. ఆమె తనను తాను అతిగా ఊహించుకుని.. తన క్రేజ్ ను ఎక్కువగా భావించుకుంటూ భారీ పారితోషికంను డిమాండ్ చేస్తుంది అంటూ కొందరు విమర్శిస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండ్డింగ్ లో ఉన్న ఇద్దరు కొత్త ముద్దుగుమ్మలు కోటి వరకు డిమాండ్ చేస్తున్నారు. వారిద్దరికి ఏమాత్రం తగ్గకుండా తన పారితోషికం కూడా ఉండాల్సిందే అన్నట్లుగా నభా నటేష్ ఆ రేంజ్ లో డిమాండ్ చేస్తుందట. నభా నటేష్ కు అంత సీన్ లేదని ఫిల్మ్ మేకర్స్ అంటూ ఆమె వద్దకు వెళ్లి మళ్లీ ఆ పారితోషికం మా వల్ల కాదు అన్నట్లుగా వెనక్కు వచ్చేస్తున్నారట.

తాజాగా ఒక టాలీవుడ్ నిర్మాత నభా నటేష్ ను సంప్రదించగా కోటి డిమాండ్ చేయడంతో మరో హీరోయిన్ ను అప్రోచ్ అయ్యాడట. కెరీర్ ఆరంభంలో ఇలా మంచి సినిమాలను వదులుకోవడం ఏంటీ అంటూ కొందరు నభా నటేష్ ను విమర్శిస్తున్నారు. కెరీర్ లో నిలదొక్కుకునే వరకు పారితోషికం విషయం లో పట్టింపు లేకుండా ఉండాలి తప్ప ఇలా డిమాండ్ చేస్తే కెరీర్ లో ముందుకు వెళ్లడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇస్మార్ట్ బ్యూటీ అంటూ నభా నటేష్ కు పేరు ఉంది.. కాని ఆమె ఇలా సినిమా లకు భారీ పారితోషికం డిమాండ్ చేయడం ద్వారా తెలివి తక్కువ బ్యూటీ అనిపించుకుంటుంది అంటూ స్వయంగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నభా ఇప్పటికైనా కళ్లు తెరవాలని ఆమె అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. అందంతో పాటు మంచి నటన ప్రతిభ ఉన్న నభా ఇప్పుడు కాస్త మంచి సినిమా ల్లో తక్కువ పారితోషికంకు నటించినా భవిష్యత్తులో ఖచ్చితంగా కోట్ల పారితోషికాలు నభా వద్దకు వస్తాయి అనేది కొందరి అభిప్రాయం.