పర్ఫెక్షన్ కోసం సాయిపల్లవి ఇంతగా శ్రమించిందా?

Tue Jan 25 2022 21:47:49 GMT+0530 (IST)

She danced like a peacock dancing

సినీ ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్స్ వున్నా కొంత మంది మాత్రమే పర్‌ఫెక్షన్ కోసం శ్రమిస్తుంటారు. అలాంటి వాళ్ల జాబితాలో నిలిచే వ్యక్తి సాయి పల్లవి. అందుకే తను చేసింది తక్కువ సినిమాలే అయినా హీరోయిన్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. నటిగా మంచి పేరు తెచ్చుకున్న సాయి పల్లవి డ్యాన్స్ గురించి కూడా ప్రత్యేకంగా ప్రశంసలు అందుకున్న సందర్భాలున్నాయి. ఆమె డ్యాన్స్ చేసిందంటే నెమలి నాట్యం చేసినట్టే వుంటుంది.ఇందుకు ఆమె చేసిన `వచ్చిండే.. మెల్లగ వచ్చిండే..  రౌడీ బేబీ.. ఏవండోయ్ నాని గారూ... ఏవో ఓవో కలలే.. వంటి పాటలు నెట్టింట రికార్డులు సృష్టించి సాయి పల్లవి డ్యాన్స్ ల్లోనూ సెస్సెషన్ క్రియేట్ చేసింది. ప్రతీ పాటలోనూ తనదైన స్టైల్ స్టెప్పులతో పూర్తి స్థాయి పెర్ఫెక్షన్ తో శ్రమించి ఆ పాటకే వన్నెతెచ్చే సాయి పల్లవి తాజాగా నేచురల్ స్టార్ నాని సినిమా కోసం చాలా శ్రమించింది. సాయి పల్లవి నటించిన తాజా చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బెంగాలీ దేవదాసిగా కనిపించి అందరిని అబ్బుర పరిచింది.

ఈ చిత్రంలో సాయి పల్లవిపై చిత్రీకరించిన `ప్రణవాలయ..` సాంగ్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఈ పాటలో సాయి పల్లవి వేసిన స్టెప్స్ ఆమె మేకోవర్ ఈ పాటని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఆమె డ్యాన్స్ చేసిన తీరు ప్రతీ ఒక్కరి చేత ఔరా ఏమీ పర్ఫెక్షన్ అనేలా చేసింది. సినిమాలో నాని సాయి పల్లవి మధ్య పరిచయ సన్నివేశంలో వచ్చే ఈ పాట విజువల్ ట్రీట్ గా నిలియింది. అయితే దీని కోసం సాయి పల్లవి తెరవెనుక శ్రమించిన తీరు పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా `శ్యామ్ సింగ రామ్` లోని ప్రణవాలయ పాట కోసం తాను రిహార్సల్స్ చేసిన వీడియోని సాయి పల్లవి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

 పర్ఫెక్షన్ కోసం ఆమె ఇంతగా శ్రమించిందా? అని అంతా అవాక్కవుతున్నారు. తాను షేర్ చేసిన వీడియోకు ఆసక్తికరమైన పోస్ట్ ని షేర్ చేసింది సాయి పల్లవి.  `ప్రణవాలయ.. పాటకు డ్యాన్స్ చేస్తుంటే నాకు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేను. నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రదర్శనల్లో ఇది ముందు వరుసలో నిలుస్తుంది. రూపాలి కంథారియా కుష్బూ వాకానిలకు ఈ క్రెడిట్స్ దక్కాలి` అని పోస్ట్ చేసింది.