అమ్మకు అమ్మగా మారి అల్లరి చేసింది

Sat Jan 29 2022 17:00:01 GMT+0530 (IST)

She became a mother to her mother

అమ్మంటే ఇష్టం లేనిది ఎవరికి.. కనిపెంచే దైవం అమ్మ... కళ్లముందు కనిపించే దైవం అమ్మ.. మనకి ఏదైనా జరగరానిది జరిగితే తల్లడిల్లేది అమ్మే.. అలాంటి అమ్మని కీర్తిస్తూ ఇంత వరకు ఎన్నో వేల పాటలొచ్చాయి. చిన్నతనంలో గారాం చేస్తూ అన్నం తననంటే చందమామని చూపిస్తూ అమ్మ గోరుముద్దలు తినిపించడం ప్రతీ ఒక్కరికీ అనుభవమే. అమ్మతో కలిసి ఆటలాడుకోవాలని చూసినప్పుడు అమ్మ వాహనంలా మారి వీపుపై మోస్తూ నవ్వించడం.. ఉప్పు మోయడం ప్రతీ ఒక్కరికి ఆ పాత జ్ఞాపకాలు మధురాతి మధురంగా మదిలోతుల్లో నిక్షిప్తమై వుంటాయి.అయితే అలాంటి సేవలే అమ్మకు చేయాల్సి వస్తే.. అమ్మని ఉప్పు మోస్తే.. ఎలా వుంటుంది.. ఊహించడానికే కొత్తగా వుంది కదూ.. ఓ హీరోయిన్ అచ్చు అమ్మ చిన్నతనంలో మనల్ని వైపుపై కూర్చోబెట్టుకుని ఎలా ఉప్పుమోస్తూ సంబరపడిందే అదే తరహాలో ఓ యంగ్ అండ్ క్రేజీ హీరోయిన్ తన మాతృమూర్తిని తన వీపుపై ఉప్పులా మోస్తూ సంబరపడింది. అమ్మకు అమ్మగా మారి అల్లరి చేసింది..
వివరాల్లోకి వెళితే...

తెలుగులో `జెంటిల్మన్` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నివేదా థామస్ నటిగా తెలుగులో మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. ఇటీవల `వకీల్ సాబ్` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని తెలుగులో మరింత పాపులారిటీని దక్కించుకుంది. ప్రస్తుతం సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న `శాకిని ఢాకిని` చిత్రంలో రెజీనాతో కలిసి ఓ హీరోయిన్ గా నటిస్తోంది.

నేడు నివేదా థామస్ మదర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె చేసిన ఓ పని ఇప్పడు నెట్టింట వైరల్ గా మారి ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా ఇమెని తన వీపుపై మోస్తూ సంబరపడింది. ఆ ఫొటోని సోషల్ మీడియా ఇన్ స్టా వేదిగా అభిమానులతో పంచుకుంది. అంతే కాకుండా ఈ ఫొటోకు ఆసక్తికరమైన పోస్ట్ ని షేర్ చేసింది.

అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నేను ఈ భూమిని విడిచి వెళ్లేంత వరకు నీ ప్రేమ భారాన్ని మోస్తూనే వుంటాను` అని క్యాప్షన్ ఇచ్చింది. అమ్మకు అమ్మగా మారి నివేదా థామస్ అల్లరి చేసింది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది.  ఇదిలా వుంటే ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి తన మాతృమూర్తి పుట్టిన రోజు సందర్భంగా ఎమోషనల్ అయ్యారు.

 క్వారెంటైన్ లో వుండటం వల్ల తాను తన తల్లిని కలవలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశారు. `అమ్మా నీకు జన్మదిన శుభాకాంక్షలు. క్వారెంటైన్ లో వున్న కారణంగా ప్రత్యక్షంగా కలుసుకుని నీ చల్లని ఆశీస్సులు తీసుకోలేక ఇలా విషెస్ తెలుపుతున్నాను. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు న్మకి కూడా కావాలని ఆ భగవందుడిని కోరుకుంటున్నా.. ప్రేమతో .. శంకర్ బాబు` అని తన తల్లితో దిగిన ఫొటోని షేర్ సేస్తూ పోస్ట్ పెట్టడం నెట్టింట వైరల్ గా మారింది.