శర్వానంద్ పెళ్లాడే అమ్మాయి ఈమే..!

Tue Jan 24 2023 20:30:10 GMT+0530 (India Standard Time)

Sharwanand To Enter The Wedlock With Rakshita Reddy

యువ హీరో శర్వానంద్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇటీవల కథనాలొచ్చాయి. అతడికి పెద్దలు కుదిర్చిన వివాహం నిశ్చయమైందని కూడా గుసగుసలు వినిపించాయి. త్వరలోనే ఆ శుభవార్తను అధికారికంగా చెప్పేందుకు సిద్ధమవుతున్నాడని తాజాగా తెలిసింది. శర్వా హైకోర్టు లాయర్ మధుసూధన్ రెడ్డి కుమార్తె  రక్షిత రెడ్డిని పెళ్లాడనున్నాడు.రక్షితకు రాజకీయ నేపథ్యం ఉంది. రాజకీయ నాయకుడు బొజ్జల గోపాల కృష్ణారెడ్డికి స్వయానా మనవరాలు.  ఆమె మేనమామ గంగారెడ్డి బొజ్జల గోపాల కృష్ణారెడ్డికి అల్లుడు. శర్వానంద్- రక్షిత రెడ్డి జోడీకి ఇరువైపులా కుటుంబ సభ్యులు త్వరలో పెళ్లి తేదీని ప్రకటించనున్నారు.

శర్వానంద్ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న వేళ అభిమానుల్లో ఇది ఆసక్తికరంగా మారింది. ఇటీవలే వర్షం దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ నటించిన `కళ్యాణం కమనీయం` చిత్రంలో పూర్తిగా పెళ్లిని వ్యతిరేకించేవాడిగా అతిథి పాత్రతో అలరించే ప్రోమో ఆకట్టుకుంది. ఇంతలోనే ఇప్పుడు శర్వా పెళ్లి ప్రకటన ఆసక్తిని కలిగించింది.

మెగాస్టార్ శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో అతిథిగా నటించిన శర్వా మెగా తనయుడు రామ్  చరణ్ కి బెస్ట్ ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే.  తన ఇంట్లోనే పెరిగిన కిడ్ శర్వా తన కళ్ల ముందే హీరోగా  ఎదగడం సంతోషంగా ఉందని మెగాస్టార్ పలు సందర్భాల్లో అన్నారు. శర్వా పెళ్లికి ఘనంగా మెగాశీస్సులు దక్కనున్నాయన్న చర్చ ఇప్పుడు మెగాభిమానుల్లో సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.