శర్వానంద్ 'శ్రీకారం' రిలీజ్ డేట్ అదేనా..!!

Sun Jan 24 2021 00:02:45 GMT+0530 (IST)

Sharwanand Srikaram release date is March 11

టాలీవుడ్ యువహీరో శర్వానంద్.. డెబ్యూ డైరెక్టర్ కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదాపడింది. అయితే ఈ సినిమా పూర్తి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుండటంతో.. అలాగే శర్వా కూడా ఫస్ట్ టైం వ్యవసాయం నేపథ్యంలో సినిమా చేయడం కాస్త ఆసక్తి కలిగించే విషయం. ఇక శ్రీకారం సినిమా నుండి ఇదివరకే విడుదల చేసిన లిరికల్ సాంగ్స్ 'భలేగుంది బాలా' సందల్లే సందల్లే పాటలు సోషల్ మీడియాలో ఎలాంటి బజ్ క్రియేట్ చేసాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా పెంచల్ దాస్ లిరిక్స్ అందించి మరీ ఆలపించిన 'భలేగుంది బాలా' పాట ఇప్పటికి సినీ అభిమానులకు ఫేవరేట్ గా మారింది. తాజాగా శ్రీకారం సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. శ్రీకారం సినిమాను మార్చ్ 11న విడుదల చేయాలనీ దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.అన్ని ఉద్యోగాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తామో.. వ్యవసాయానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలనే సందేశంతో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తుంది. లైన్ కాస్త పాతదే అనిపించినా కథాకథనాలు బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. అయితే అదే మార్చ్ 11న విడుదలవ్వడానికి చాలా సినిమాలు పోటీ పడుతున్నాయట. మంచు విష్ణు మోసగాళ్లు సినిమా కూడా అదేరోజు రాబోతుందని టాక్. ఇంకా ఇతర హీరోలు కూడా అదే డేట్ పరిశీలిస్తున్నారట. చూడాలి మరి యువహీరోల మధ్య ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో.. ఇదిలా ఉండగా శర్వానంద్ ఈ మధ్య చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరుస్తున్నాయి. శతమానంభవతి తర్వాత హిట్లు పడక వెనకబడిపోయాడు. మధ్యలో రణరంగం జాను సినిమాలు చేసాడు కానీ అవి కూడా బోల్తా కొట్టడంతో శ్రీకారం పై భారీ ఆశలే పెట్టుకున్నాడు శర్వా. మరి కొత్త డైరెక్టర్ గట్టేక్కిస్తాడో లేదో చూడాలి!