'రణరంగం' పైనే శర్వా ఆశలు

Tue Aug 13 2019 23:01:49 GMT+0530 (IST)

Sharwanand Hopes on about Ranarangam Movie

కెరీర్ ప్రారంభం నుండి తనకు పర్ఫెక్ట్ అనిపించే పాత్రలు - సినిమాలు ఎంచుకుంటూ తక్కువ టైంలోనే హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు శర్వా.  అయితే ఈ మధ్య శర్వా నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం రాబట్టలేకపోయాయి. 'శతమానం భవతి' తర్వాత శర్వా నుండి సంతృప్తి చెందే సినిమా రాలేదు.  'పడి పడి లెచే మనసు' కి మంచి బజ్ వచ్చింది. ఈ సినిమా శర్వా కి కచ్చితంగా హిట్టిస్తుందని అందరూ ఊహించారు. కానీ 'పడి పడి లెచే మనసు' అనుకోని విధంగా బోల్తా కొట్టింది. తొలి రోజే బ్యాడ్ టాక్ సొంతం చేసుకుంది.ఇప్పుడు శర్వాకి  ఓ సూపర్ హిట్ పడాల్సిందే. అందుకే తన ఆశలన్నీ  'రణరంగం' మీదే పెట్టుకున్నాడు ఈ యంగ్ హీరో. ఆగస్ట్ 15న ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తుంది. సుధీర్ వర్మ కూడా 'కేశవ'తో ఆశించిన విజయం అందుకోలేకపోయాడు. ఇప్పుడు సుదీర్ కి కూడా హిట్ అవసరం. 'రణరంగం' టీజర్ - ట్రైలర్ అయితే  ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసాయి. సినిమాలో శర్వా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో మెప్పిస్తాడనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది.

ప్రస్తుతం 'రణరంగం' ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న శర్వా ఈ సినిమా రిజల్ట్ కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నాడు. సినిమా రిలీజ్ అవ్వగానే మళ్ళీ '96' రీమేక్ షూటింగ్ లో పాల్గొంటాడు. మరి ఈ  శర్వా ఎలాంటి హిట్ సాదిస్తాడో మరికొన్ని గంటలో తేలిపోనుండి.