ఆయన 'జీరో' అన్నవాళ్ళకి ఇదే సమాధానం

Sun Sep 25 2022 11:30:53 GMT+0530 (India Standard Time)

Sharukh Khan Jawan Movie

బాలీవుడ్ బాద్ షా సక్సెస్ దక్కించుకుని దశాబ్దం దాటినట్లే ఉంది. ఇక ఆయన చివరి సారి జీరో సినిమా తో వచ్చి కూడా దాదాపుగా మూడు సంవత్సరాలు అయ్యింది. జీరో సినిమా తర్వాత షారుఖ్ ఖాన్ జీరో అయ్యాడని అంతటా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఒక వర్గం మీడియాలో షారుఖ్ ఖాన్ కెరీర్ ఖతం అన్నట్లుగా కథనాలు వచ్చాయి. కానీ అనూహ్యంగా జీరో అన్నవారితోనే హీరో అనిపించుకునేందుకు షారుఖ్ సిద్ధం అయ్యాడు.సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ వరుసగా కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. అందులో మొదటగా పఠాన్ సినిమా విడుదల అవ్వబోతుంది. భారీ బిజినెస్ చేసిన పఠాన్ సినిమా విడుదల తర్వాత సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నారు. ఇదే సమయంలో తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న జవాన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

జవాన్ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు.. కనీసం టీజర్ కూడా విడుదల అవ్వలేదు. అయినా కూడా ప్రముఖ ఓటీటీ మరియు శాటిలైట్ ఛానల్ వారు ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేశారని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఓటీటీ మరియు శాటిలైట్ ద్వారానే ఏకంగా రూ.250 కోట్ల రూపాయలు ఈ సినిమాకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

రూ.150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న జవాన్ సినిమాకు ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్ తోనే 250 కోట్లు నమోదు అవ్వడంతో ఏ స్థాయిలో షారుఖ్ ఖాన్ అంటే క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. షారుఖ్ ఖాన్ ను జీరో అన్నవారికి ఇది గట్టి సమాధానం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సౌత్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న జవాన్ సినిమా లో నయనతార కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో నటించడం తో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది జూన్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.