జిమ్ లో సెల్ఫీలతో మత్తెక్కిస్తున్న శర్మాగాళ్

Sun May 09 2021 10:21:05 GMT+0530 (IST)

Sharma Girl intoxicated with selfie in the gym

సోషల్ మీడియాల్లో శర్మా సిస్టర్స్ స్పీడ్ గురించి తెలిసిందే. నేహాశర్మ-ఐషా శర్మ సిస్టర్స్ నిరంతరం వేడెక్కించే ఫోటోలు వీడియోలతో యువతరంలో హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు. సోదరి ఐషా శర్మ సినీరంగంలో కథానాయికగా రాణించేందుకు చేయని ప్రయత్నం లేదు. ఆ క్రమంలోనే వరుస ఫోటోషూట్లతో దర్శకనిర్మాతలకు ఫీలర్స్ ని వదిలే ఈ అమ్మడు జిమ్ లో వర్కవుట్ ఫోటోని షేర్ చేసింది.శర్మా గాళ్ బ్లాక్ ట్రాక్ ఫ్యాంట్.. సింపుల్ టాప్ తో జిమ్ లో సెల్ఫీ దిగుతున్న తాజా ఫోటో ప్రస్తుతం యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. పర్ఫెక్ట్ టోన్డ్ బాడీతో ఐషా అందచందాలు అగ్గి రాజేస్తున్నాయి. ఫిట్నెస్ విషయంలో ఈ భామ శ్రద్ధాసక్తులు యూత్ కి ఇట్టే కనెక్టయిపోతుంటాయి. తాజా క్రైసిస్ లో సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకుని ఐషా పర్ఫెక్ట్ గోల్ ఫిక్స్ చేసుకుందని అర్థమవుతోంది.

ఇక ఇదే రూపంతో ఈ అమ్మడి ఫీలర్స్ ని ఇటు సౌత్ లో దర్శకనిర్మాతలు క్యాచ్ చేస్తారేమో చూడాలి. అటు ఉత్తరాదినా ఐషా కెరీర్ ఇంకా స్వింగ్ లోకి రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇన్ స్టా మాధ్యమంగా వాణిజ్య ప్రకటనల్ని షేర్ చేస్తూ లక్షల్లో ఆర్జిస్తోంది.