లవ్ లీ మనసు మళ్లీ టాలీవుడ్ పైకి మళ్లిందట

Tue Sep 14 2021 06:00:02 GMT+0530 (IST)

Shanvi Srivastava Latest Photo

కన్నడ బ్యూటీ శాన్వి శ్రీవత్సవ అందచందాలు ప్రతిభ గురించి పరిచయం అవసరం లేదు. లవ్ లీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. క్యూట్ లుక్స్ తో కుర్రకారు గుండెల్ని గిల్లేసిన శాన్వీ తొలి ప్రయత్నం ఆది సాయికుమార్ సరసన సాంప్రదాయ బద్ధంగా కనిపించింది. అయితే రంగుల మాయా ప్రపంచంలో గ్లామర్ అనే అంశం చాలా కీలకమైనది. ఆ తర్వాత కెరీర్ కోసం గ్లామర్ పరంగా ఓపెనైంది. మంచు విష్ణు సరసన ఆర్జీవీ డైరెక్షన్ లో చెలరేగి అందాల్ని ఆరబోసింది. అయినా టాలీవుడ్ లో ఆశించిన కెరీర్ ని దక్కించుకోవడంలో తడబడింది క్యూటీ.చాలా గ్యాప్ తర్వాత `అతడే శ్రీమన్నారాయణ` చిత్రంలో నాయికగా నటించి మెప్పించింది. ఇది కన్నడ -తెలుగులో విడుదలై ఆకట్టుకుంది. ప్రస్తుతం కన్నడలో త్రిశూలం.. కస్తూరి- బ్యాంగ్ అనే మూడు సినిమాల్లో నటిస్తోంది. ఇవన్నీ కరోనా వల్ల చిత్రీకరణలు ఆలస్యమయ్యాయి. ఇటీవలే మహావీర్ యార్ అనే మలయాళ చిత్రానికి శాన్వి సంతకం చేసింది.

మరోవైపు సోషల్ మీడియాల్లో తన ఫాలోయింగ్ ని ఏమాత్రం తగ్గకుండా కాపాడుకునేందుకు నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో టచ్ లో ఉంటోంది. ఇంతకుముందు కేరళలోని పచ్చందాల నడుమ వరుస ఫోటోషూట్లను షేర్ చేయగా వైరల్ అయ్యాయి. శాన్వి తాజా ఫోటోషూట్ అభిమానుల్లోకి వైరల్ గా దూసుకెళుతోంది. శాన్వీలో క్యూట్ నెస్ .. హాట్ అప్పియరెన్స్ కి సింబాలిక్ ఈ ఫోటోషూట్. శాన్వీ వైట్ మెస్ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపిస్తోంది. మరోసారి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వాలన్నది తన కోరిక అని తెలిసింది. క్యూట్ బ్యూటీ మరీ ఇంతగా చెలరేగాకా ఛాన్సివ్వకపోతారా? మన దర్శకనిర్మాతల చూపు శాన్వీ వైపు ప్రసరిస్తుందేమో చూడాలి.