మళ్లీ వచ్చేస్తున్న శంకరాభరణం మేకర్స్

Mon May 16 2022 13:04:50 GMT+0530 (IST)

Shankarabharanam Makers is coming again

తెలుగులో క్లాసికల్ మూవీగా నిలిచిన చిత్రం 'శంకరా భరణం'. శాస్త్రీయ సంగీతానికి మానవతా విలువలకు పెద్ద పీట వేస్తూ కళాతపస్వీ కె. విశ్వనాథ్ తెరకెక్కించిన అద్భుతం ఈ చిత్రం. ఈ మూవీతో పాటు ఎన్నో అత్యుత్తమ చిత్రాలని అందించి తెలుగు చిత్ర సీమలో తమకంటూ ప్రత్యేకతని చాటుకున్నారు సూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు. ఆయన తరువాత ఈ సంస్థని మళ్లీ వారి వారసులు పునరుద్థరించలేదు. కానీ ఆ తరువాతి తరం మళ్లీ సినిమాల నిర్మాణం చేపట్టింది.శ్రీజ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఏడిద శ్రీరామ్ సమర్పణలో ఏడిద శ్రీరామ్ కూతురు ఏడిద శ్రీజ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆమె నిర్మిస్తున్న తాజా చిత్రం 'ఫస్ట్ డే ఫస్ట్ షో'.

ఈ చిత్రానికి 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కె.వి స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందిస్తున్నారు. వంశీధర్ గౌడ్ లక్ష్మీ నారాయణ .పి ఈ సినిమా ద్వారా దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూడాలని టికెట్ ల కోసం ఎదురుచూస్తుంటారు.

ఇదే కథని ఎంటర్ టైన్ మెంట్ ని జోడీంచి వంశీధర్ గౌడ్ లక్ష్మీ నారాయణ .పి తెరకెక్కించబోతున్నారు. విభిన్నమైన కథ కథనాలతో ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కనున్న ఈ మూవీలోశ్రీకాంత్ రెడ్డి సంచిత బసు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

'జాతిరత్నాలు' చిత్రాన్ని ఫన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న అనుదీప్ కె.వి ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందిస్తుండటంతో ఈ చిత్రంపై సహజంగానే అంచనాలు మొదలయ్యాయి.

కొత్త కథతో అభిమానులని విశేషంగా ఆకట్టుకునే కథనంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం రధన్ స్క్రీన్ ప్లే అనుదీప్ కల్యాన్ వంశీధర్ గౌడ్ డైలాగ్స్ అనుదీప్ కె.వి ఫొటోగ్రఫీ ప్రశాంత్ అంకిరెడ్డి ఎడిటింగ్ మాధవ్ ఆర్ట్ సీహెచ్ శంకర్ పాటలు రామజోగయ్యశాస్త్రి వంశీధర్ గౌడ్ వాసు.