Begin typing your search above and press return to search.

మెగా ఫ్యాన్స్ కు శంక‌ర్ - చ‌ర‌ణ్ బిగ్‌ స‌ర్ ప్రైజ్‌?

By:  Tupaki Desk   |   18 May 2022 7:30 AM GMT
మెగా ఫ్యాన్స్ కు శంక‌ర్ - చ‌ర‌ణ్ బిగ్‌ స‌ర్ ప్రైజ్‌?
X
క్రేజీ మ‌ల్టీస్టారర్ 'ట్రిపుల్ ఆర్‌' తో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ద‌ర్‌శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఇటీవ‌ల విడుద‌లై ఐదు భాష‌ల్లో సంచ‌ల‌న విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన ఈ మూవీ అల్లూరి పాత్ర‌లో త‌న‌దైన మార్కు న‌ట‌న‌తో చ‌ర‌ణ్ ఆక‌ట్టుకున్న తీరుకు ప్రేక్ష‌కులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఈ మూవీ త‌రువాత రామ్ చ‌ర‌ణ్ ది గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో భారీ మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే.

RC15 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. శంక‌ర్‌, చ‌ర‌ణ్ ల కెరీర్‌లో ఇది 15వ చిత్రం. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ కిది 50 సినిమా కావ‌డంతో ఈ మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించి చాలా ప్ర‌త్యేక‌త‌ల‌తో తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఇందులో చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న‌ట్టుగా ఇటీవ‌ల లీకైన చ‌ర‌ణ్ లుక్ ని బ‌ట్టి క్లారిటీ వ‌చ్చేసింది.

అంతే కాకుండా సినిమా కొంత భాగం 1930 కాలం నాటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న‌ట్టు ఇప్ప‌టికే స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. పీరియ‌డిక్ స్టోరీతో తెర‌కెక్కుతున్న ఈ మూవీని 1930కి నేటి కాలానికి లింక‌ప్ చేస్తూ ద‌ర్శ‌కుడు శంక‌ర్ రూపొందిస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

స‌మ‌కాలీన రాజ‌కీయాంశాల నేప‌థ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నార‌ట‌. ఓ పాత్ర‌లో చ‌ర‌ణ్ ప‌వ‌ర్ ఫుల్ పొలిటిక‌ల్ లీడ‌ర్ గానూ, మ‌రో పాత్ర‌లో ఐఏఎస్ ఆఫీస‌ర్ గానూ క‌నిపించ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

గ‌త కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ వైజాగ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతోంది. అక్క‌డ చ‌ర‌ణ్ కు సంబంధించిన ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీకరిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఒక‌టి నెట్టింట సంద‌డి చేస్తోంది. సినిమా ప్రారంభం అయిన ద‌గ్గ‌రి నుంచి ఫ్యాన్స్ ఈ మూవీ టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం గురువారం ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ తో పాటు టైటిల్ ని కూడా ద‌ర్శ‌కుడు శంక‌ర్ రివీల్ చేయ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. చాలా రోజులుగా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల‌కు గురువారం స‌ర్ ప్రైజ్ ఇస్తూ రివీల్ చేయ‌బోతున్నార‌ట‌.

ఇదే నిజ‌మైతే ఫ్యాన్స్ కి పండ‌గే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. ఇటీవ‌ల 'ఆచార్య‌' ఫ్లాప్ తో నిరావ‌లో వున్న మెగా అభిమానుల‌కు RC15 ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ పోస్ట‌ర్ తో మ‌ళ్లీ కొత్త జోష్ నింపిన‌ట్ట‌వుతుంద‌ని చెబుతున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలో అంజ‌లి, జ‌య‌రామ్‌, శ్రీ‌కాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.