Begin typing your search above and press return to search.

హెల్త్‌ అప్‌డేట్‌... గుడ్ న్యూస్ చెప్పిన స్టార్‌ హీరో

By:  Tupaki Desk   |   30 Jun 2022 10:30 AM GMT
హెల్త్‌ అప్‌డేట్‌... గుడ్ న్యూస్ చెప్పిన స్టార్‌ హీరో
X
తమిళ స్టార్‌ హీరో శింబు తండ్రి టి రాజేందర్‌ ఆరోగ్య పరిస్థితిపై గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ వర్గాల వారు మరియు తమిళ సినీ ప్రేమికులు ఆందోళనతో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం టి రాజేందర్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఆ సమయంలో టి రాజేందర్ ను శింబు మరియు కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం అమెరికా తీసుకు వెళ్లడం జరిగింది.

అమెరికాలో అత్యంత అరుదైన చికిత్సను టి రాజేందర్‌ కు ఇప్పిస్తున్నారు అంటూ మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. ఆయన ఆరోగ్యం గురించి ఇంకా కూడా ఆందోళన ఉన్న నేపథ్యంలో శింబు ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చాడు.

తన తండ్రి ఆరోగ్యం విషయంలో అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అంతా కూడా ఆనందించేటువంటి వార్తను షేర్‌ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

టి.రాజేందర్‌ తో ఉన్న ఫోటోను శింబు షేర్‌ చేయడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడిందని.. గతంతో పోల్చితే ఆయన చాలా రికవరీ అయినట్లుగా కనిపిస్తున్నారని శింబు అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా చర్చించుకుంటున్నారు. టి. రాజేందర్‌ వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కనుక ఆయన విషయంలో ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

ఎట్టకేలకు టి రాజేందర్‌ ఆరోగ్యం బాగుంది.. కుదుట పడుతుందని క్లారిటీ ఇవ్వడంతో అంతా కూడా హ్యాపీ అన్నట్లుగా పరిస్థితి ఉంది. టి రాజేందర్‌ ఒక ఫిల్మ్‌ మేకర్‌ గా నటుడిగా.. నిర్మాతగా తమిళ సినీ వర్గాల వారికి సుపరిచితుడు.

ఎన్నో సినిమాల్లో నటించి తెరకెక్కించిన ఆయన ఇతర భాషల్లో కూడా గుర్తింపు దక్కించుకుని మంచి పేరును దక్కించుకున్నాడు. అలాంటి టి రాజేందర్‌ ఆరోగ్యం మెరుగు పడాలని అభిమానులు ఎంతో మంది ప్రార్థించారు. వారి ప్రార్థన ప్రతిఫలంగా ఇప్పుడు రాజేందర్‌ ఆరోగ్యంతో ఉన్నాడు.