Begin typing your search above and press return to search.

రెట్రో లుక్ తో అగ్గి రాజేసిన హాట్ షామా

By:  Tupaki Desk   |   23 Jan 2021 11:30 AM GMT
రెట్రో లుక్ తో అగ్గి రాజేసిన హాట్ షామా
X
షామా శికంద‌ర్.. ఇటీవ‌ల ఇన్ స్టా మాధ్య‌మంలో వ‌రుస ఫోటోషూట్ల‌తో దుమారం రేపుతున్న టీవీ న‌టి కం మోడ‌ల్. తాజాగా హాలీవుడ్ స్టార్ల‌‌కే చెమ‌ట‌లు ప‌ట్టించే రెట్రో లుక్ తో అదిరిపోయే ట్రీటిచ్చింది షామా.

చూస్తుంటే ఈ లుక్ ష‌రాన్ స్టోన్ బేసిక్ ఇన్ స్టింక్ట్ కి మార్ఫింగులా ఉంది. మ‌రొక కోణంలో రెట్రో లుక్ లో ఔరంగ్ జేబ్.. మౌలిన్ రూజ్ యుగానికి తీసుకెళ్లిపోతోంది. తాజాగా రిలీజ్ చేసిన ఫోటోషూట్ లో బ్లాక్ డిజైన‌ర్ ఫ్రాక్ లో దుమారం రేపుతోంది. ఇక హాలీవుడ్ శృంగార నాయిక‌ను త‌ల‌పించేలా .. అలా లాలిపాప్ ని నోట్లు ఉంచి ఊరిస్తోంది. హాలీవుడ్ తారలు ధరించినట్లు షామా కూడా చేతికి తొడుగులు ధరించింది.

ఈ లుక్ పై షామా ఏమందంటే.. నా లుక్ హాలీవుడ్ క్లాసిక్ డేస్ ని స్ఫుర‌ణ‌కు తెచ్చేదిగా ఉంటుంది. చికాగో డౌన్ టౌన్-మీట్స్-మౌలిన్ రూజ్ ‌ను రెట్రో మెల్ట్ డౌన్ లో చూపించాల‌నుకున్నాం. ఈ ఫోటో షూట్ వెనుక ఉన్న ఆలోచన అదే. ఔట్ పుట్ బాగా వ‌చ్చింద‌ని అనుకుంటున్నాను`` అని తెలిపింది. ఫోటోగ్రఫీ బాగుంది. ఇది సంపూర్ణ ట్రీట్. దీనికోసం చాలా ఎక్కువ స‌మ‌యం తీసుకున్నాం.. అని వెల్ల‌డించింది షామా. ఒక్కరోజులో సృష్టించుకున్న ప్ర‌పంచం నాది కాదు! అని కూడా షామా ఇన్ స్టాలో కోట్ చేసింది. అన్న‌ట్టు షామా శ్ర‌మ చూసి ఇటు సౌత్ లో అయినా అవ‌కాశాలిస్తారేమో చూడాలి.