థై సొగసరి తళాంగుతకదిమితోం!

Tue Nov 19 2019 07:00:02 GMT+0530 (IST)

ఇసుకు తిన్నెల్లో .. బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో అగ్గి రాజేసే హాట్ గాళ్ షామా శికందర్ గుర్తుంది కదూ? వయసు 40 కి దగ్గరవుతున్నా అదే వేడి .. అదే వాడి!! మోడలింగ్ టీవీ రంగం నుంచి వచ్చిన ఈ భామకు టీవీ యాంకర్ గానూ అభినివేశం ఉంది. ఇక సామాజిక మాధ్యమాల్లో అసాధారణ ఫాలోయింగ్ ఉంది. ఫ్యాన్స్ కోసం రెగ్యులర్ బేసిస్ లో వేడి పెంచే ఫోటోషూట్లతో ఇన్ స్టాని హీటెక్కిస్తుంటుంది.



చాలా కాలంగా ఈ భామ సెల్పీలు- హాట్ ఫీలు.. రెగ్యులర్ ఫోటోషూట్లు అంటూ  వేడి పెంచుతూనే ఉంది. 38 వయసుకు చేరువై బార్డర్ కి చేరిపోతున్నా.. తనలోని హీట్ తగ్గడం లేదని ఈ ఫోటోషూట్లు చెబుతున్నాయి. తాజాగా ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసిన ఆ థై షో ఫోటో యూత్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో జోరుగా వైరల్ అవుతోంది. షామా నిరంతర తైతక్కలు తందనాలు యూత్ ని ఓ రేంజులో వెర్రెత్తిస్తూనే ఉన్నా.. ఆశించినంతగా సినిమా ఛాన్సులే రావడం లేదు.

మరీ ఇంతగా వేడి పెంచేస్తోంది కాబట్టి .. ఆ థై-తక్కలు చూసైనా టాలీవుడ్ ఆహ్వానం పలుకుతుందేమో!.. మొహమాటం అన్నదే లేకుండా వయ్యారాల్ని వడ్డించేస్తున్న ఈ బ్యూటీపై మనవాళ్ల దృష్టి మరలలేదు ఎందుకనో ఇంతకాలం.  తెల్ల చొక్కా జారిపోతోంది... ఆ థై అందాలు ఆవిరైపోతున్నాయ్. అందుకే  ఇకనైనా అటువైపు చూస్తారేమో మరి.