పెద్దతెరను షేక్ చేసే ప్లాన్ లో స్టార్ వైఫ్

Sun Nov 22 2020 08:00:01 GMT+0530 (IST)

Star Wife in a plan to shake the big screen

తమిళ స్టార్ హీరో.. తళా అజిత్ వైఫ్ షాలిని గురించి పరిచయం అవసరం లేదు. షాలిని బాలనటిగా పాపులరై అటుపై కథానాయికగానూ నటించింది. హీరోయిన్ కావడానికి ముందు బాల నటిగా చాలా సినిమాలు చేసింది. అనేక మంది హీరోలతో కలిసి పనిచేసింది. మాధవన్ సరసన సఖి చిత్రంలో కథానాయికగా నటించి మెప్పించింది.

తమిళ సూపర్ స్టార్ అజిత్ ను ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుండి సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం కుటుంబాన్ని చూసుకుంటుంది. కానీ ఇంతలోనూ ఊహించని అప్ డేట్ అందింది. షాలిని తిరిగి ముఖానికి రంగేసుకోబోతున్నారు. త్వరలో వెండితెరపై నటించేందుకు సిద్ధమవుతున్నారట.అంతకంటే ముందే.. పాపులర్ OTT ప్లాట్ ఫామ్ కోసం షాలిని తమిళ వెబ్ సిరీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తమిళ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే దీనికి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.