సఖి రెండో ఇన్నింగ్స్ అతిపెద్ద సర్ ప్రైజ్ ట్రీట్!

Tue Jul 20 2021 21:00:01 GMT+0530 (IST)

Shalini Second Innings Biggest Surprise Treat

జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలో బేబి షాలినిగా సుపరిచితమై.. ఆ తర్వాత మణిరత్నం `సఖి` చిత్రంతో కథానాయికగా తెరంగేట్రం చేసిన షాలినిని తెలుగు అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. అందాల `సఖి` షాలిని కెరీర్ పీక్స్ లో ఉండగా తమిళ స్టార్ హీరో అజిత్ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. `సఖి` సినిమాతో తమిళ ఆడియెన్ తో పాటు తెలుగు హృదయాలను దోచుకున్న షాలిని ఒక్కసారిగా ఊహించని షాక్ ఇచ్చి సినిమాల నుంచి నిష్క్రమించారు. పెళ్లి తర్వాత పూర్తిగా కుటుంబానికి సమయం కేటాయించారు. భర్త పిల్లలు అంటూ కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోయారు. నాటి నుంచి షాలిని వెండి తెరపై మళ్లీ మెరిసింది లేదు. దాదాపు రెండు దశాబ్ధాలకు పైగా ఆమె వెండి తెరకు దూరంగా ఉన్నారు.ఎట్టకేలకు ఇన్నాళ్టికి టైమ్ వచ్చింది. షాలిని సెకెండ్ ఇన్నింగ్స్  ప్రారంభించడానికి ఆసక్తి గా ఉన్నారని తెలుస్తోంది. షాలిని మళ్లీ మణిరత్నం సినిమాతోనే కంబ్యాక్ అవ్వడానికి రెడీ అయ్యారు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియన్ సెల్వన్` తో షాలిని రీ ఎంట్రీకి రంగం సిద్దమైంది. ఇందులో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

మణిరత్నం పట్టుబట్టడంతో షాలిని రీఎంట్రీకి ఒప్పుకున్నట్లు  సమాచారం. అయితే ఈ భారీ హిస్టారికల్ చిత్రంలో ఆమె పాత్ర ఎలా ఉంటుందన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే తన పాత్ర విషయంలో స్టార్ ఫిలిం మేకర్ మణిరత్నం సర్ ప్రైజ్ చేయాలని ఆమెకు కూడా క్యారెక్టరైజేషన్ గురించి వివరించలేదట. కేవలం తన నుంచి కాల్షీట్లు తీసుకున్నట్లు సమాచారం.