ఫోటో స్టొరీ: ఏక్ దమ్ కడక్ బ్యూటీ

Tue Jun 11 2019 19:38:52 GMT+0530 (IST)

Shalini Pandey Glamourous pose

అర్జున్ రెడ్డి' లాంటి బ్లాక్ బస్టర్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం సాధారణమైన విషయం కాదు. షాలిని పాండే సరిగ్గా అలాంటి సినిమాతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నటన  విషయంలో ఫుల్ మార్క్స్ తెచ్చుకున్న షాలిని.. విజయ్ దేవరకొండ కు ధారాళంగా ముద్దులిచ్చి బోల్డ్ అని కూడా నిరూపించింది. ఆ సినిమా తర్వాత షాలిని కెరీర్ ఝుమ్మని దూసుకుపోవాలి కానీ అలా ఏం జరగలేదు.. కాస్త స్లోగానే సాగుతోంది. అలా అని షాలిని అధైర్యపడకుండా సోషల్ మీడియాలో సమ్మర్ సీజన్ ను వీలైనంతగా కంటిన్యూ చేసే పనిలో బిజీగా ఉంది.తాజాగా షాలిని తన ఇన్ స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటో కోసం బికినీ టాప్ లాంటిది వేసుకొని ఒక బ్యూటిఫుల్ పోజిచ్చింది. సైడ్ యాంగిల్ లో ఫోటో తీయడంతో అమె వీపు భాగం తో పాటు.. అందాలన్నీ నయాగరా జలపాతం ఒంపుల్లా కనిపిస్తున్నాయి. హెయిర్ స్టైలింగ్ డిఫరెంట్ గా చేయడంతో షాలిని ఎంతో సెన్సువల్ గా కనిపిస్తోంది.  వీటికి తోడు షాలిని ఎక్స్ ప్రెషన్ కూడా మైకం పెంచేలా ఉంది.  ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ "మాయలో పడేస్తాను".  ఇలాంటి ఫోటోకు మొద్దుస్వరూపాలు అయితే తప్ప ఎవరైనా మాయలో పడిపోతారు.

అందుకే ఈ ఫోటోకు భారీ రెస్పాన్స్ వచ్చింది. 'ఏక్ దమ్ కడక్'.. 'ప్రెట్టీగా ఉన్న ప్రీతి'.. 'అమేజింగ్ పోజ్.. హాట్ ఎక్స్ ప్రెషన్'.. 'సెక్సీ సైడ్ యాంగిల్'..అంటూ కామెంట్స్ పెట్టారు. ఈ జనాల కామెంట్స్ తో పాటు గా 'గురు' ఫేమ్ రితికా సింగ్ ఈ ఫోటోకు నాలుగు ఫైర్ ఎమోజిలు పెట్టింది. దానికి షాలిని కూడా రెస్పాన్స్ ఇస్తూ హ్యాపీ ఎమోజీలు పెట్టింది.  ఇక షాలిని కొత్త సినిమాల విషయానికి వస్తే '100% కాదల్'.. 'అగ్ని సిరగుగళ్'.. 'గొరిల్లా' అనే తమిళ చిత్రాలో నటిస్తోంది.  వీటితో పాటుగా అనుష్క కొత్త సినిమా 'సైలెన్స్' లో కూడా షాలిని ఒక కీలక పాత్ర పోషిస్తోంది.