దుష్యంత్ ను ప్రకటించిన శాకుంతలం టీం

Sat Mar 06 2021 23:00:02 GMT+0530 (IST)

Shakuntalam team announces Dushyant

సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'శాకుంతలం' సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. రుద్రమదేవి సినిమా తర్వాత అయిదు ఏళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ సుదీర్ఘ కాలంగా అనుకుంటూ వస్తున్న హిరణ్య కశ్యప సినిమాను పక్కకు పెట్టి ఛారిత్రాత్మక ఘటం అయిన దుశ్యంతుడు శాకుంతల దేవి ప్రణయ గాథను తెరకెక్కించేందుకు సిద్దం అయ్యాడు. సమంత ను శాకుంతల దేవిగా ఎంపిక చేసిన గుణశేఖర్ దుశ్యంతుడిగా ఎవరిని తీసుకుంటాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో దుష్యంతుడి పాత్రపై క్లారిటీ ఇచ్చారు.ఈ సినిమా లో దుష్యంత్ పాత్రను మలయాళ యంగ్ స్టార్ దేవ్ మోహన్ తో చేయించబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. గత ఏడాది దేవ్ మోహన్ మొదటి సినిమా సుఫియం సుజాతయం ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటుడిగా మంచి పేరు దక్కించుకోవడంతో పాటు ఫిజిక్ పరంగా కూడా ఆకట్టుకునే విధంగా దేవ్ మోహన్ ఉంటాడు. అందుకే ఆయన్ను ఈ సినిమా కోసం దుష్యంత్ పాత్రకు గాను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దుష్యంత్ గా దేవ్ మోహన్ నటించబోతున్నట్లుగా సమంత ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. షూటింగ్ కోసం సెట్టింగ్ లు దాదాపుగా రెడీగా ఉన్నాయి. అతి త్వరలోనే సినిమా పట్టాలెక్కించి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.