బ్రహ్మాస్త్రలో మరో పవర్ఫుల్ హీరో.. నిజమేనా?

Fri Aug 12 2022 16:03:35 GMT+0530 (IST)

Shahrukh Khan Look Leaked From Brahmastra

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర శివ పార్ట్ 1 పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలెంటెడ్ నటుడు రణ్ బీర్ కపూర్ గ్లామరస్ హీరోయిన్ అలియా భట్ జంటగా నటించిన ఈ సినిమాలో మరి కొంతమంది అగ్ర నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఒక గురువుగా అమితాబచ్చన్ ఈ సినిమాలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.అలాగే మరో పవర్ఫుల్ పాత్రలో టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున కూడా దర్శనం ఇవ్వబోతున్నాడు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమాలో మరొక స్టార్ హీరో కూడా ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ స్టార్ హీరో మరెవరో కాదు బాలీవుడ్ షారుక్ ఖాన్ అని తెలుస్తోంది.

సినిమాలో అతను వానర అస్త్ర అనే ఒక బలమైన పాత్రలో కనిపించబోతున్నాడు అని అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. షారుక్ ఖాన్ పాత్ర సినిమా సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇస్తుంది అని కూడా అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ సినిమాలో మాత్రం ఎవరూ ఊహించని ఒక సర్ ప్రైజ్ రోల్ ఉండబోతున్నట్లుగా ఇదివరకే చిత్ర యూనిట్ ప్రకటించింది.

మరి ఆ పాత్ర నిజంగా  షారుక్ ఖాన్ దేనా అనేది తెలియాలి అంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ఇక ప్రస్తుతం మీడియాలో వస్తున్న కథనాలపై చిత్ర యూనిట్ పెద్దగా క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. దర్శకుడు ఆయన్ ముఖర్జీ ఆలియా భట్ అలాగే రణబీర్ కపూర్ అందరూ కూడా సినిమా ప్రమోషన్స్ లో తిరిక లేకుండా గడుపుతున్నారు.

ఇక వీలైనంత త్వరగా ఈ సినిమాకు సంబంధించిన మరొక ట్రైలర్ను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలుగులో రాజమౌళి సమర్పణలో విడుదల కానున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9వ తేదీన విడుదల కానుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.