స్టార్ హీరో భార్య చేసిన పనికి విమర్శలు

Thu Aug 09 2018 17:34:50 GMT+0530 (IST)

ఏదీ చేసినా హుందాగా చేయాలి.. ప్రముఖులు సెలబ్రెటీలు మరింత బాధ్యతతో ప్రవర్తించాలి. కేవలం డబ్బుకోసం చేస్తే విమర్శల పాలు కాకతప్పదు. ఇప్పుడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ కూడా ఏమీ ఆలోచించకుండా చేసిన యాడ్ విమర్శల పాలైంది. ఆమెపై నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు..మీరా రాజ్ పుత్ ప్రస్తుతం గర్భవతి.. మరికొన్ని నెలల్లోనే బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ నేపథ్యంలో తల్లిగా గర్వపడాల్సిన సమయం.కానీ ఆమె ఇటీవల ఓ ప్రముఖ సౌందర్య సాధనాల సంస్థ ప్రకటనలో నటించింది. అందులో ఆమె చెప్పిన డైలాగులు విమర్శలపాలయ్యాయి.

మీరా రాజ్ పుత్ ఆ యాడ్ లో మాట్లాడుతూ ‘తల్లిగా మారినంత మాత్రాన.. మీకు మీరుగా ఉండే హక్కును కోల్పోయినట్టు కాదుగా.. ఇదిగో ఇదే నా రీబార్న్ స్టోరీ’ అని యాంటి ఏజింగ్ క్రీమును రాసుకుంది. అంతేకాదు ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసింది..

దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తల్లిగా ఉండి ఆ హోదాకు మచ్చ తెచ్చేలా వయసు పెరగకుండా క్రీములు వాడండి అని చెప్పడం అవమానించడమేనని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అయినా వయసు తగ్గడానికి సహజసిద్ధమైన ఉత్పత్తులు వాడమనాలి కానీ ఇక యాంటి ఏజ్ క్రీములు ఎందుకు అని మరికొందరు ఫైర్ అవుతున్నారు. ఏదో చేద్దామని అనుకుంటే ఇప్పుడు ఏదో అయిపోయిందని మీరా తెగ బాధపడుతోందట..