మిస్టర్ అండ్ మిసెస్ అర్జున్ రెడ్డి లిప్ లాక్!

Thu Nov 08 2018 14:45:32 GMT+0530 (IST)

Shahid Kapoor and Mira Rajput share a passionate liplock

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఆయన భార్య మీరా రాజ్ పూత్ ల దీపావళి శుభాకాంక్షలు ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కు దీపావళి శుభాకాంక్షలు చెప్పేందుకు షాహిద్ కపూర్ తన భార్యను అధర చుంభనం చేసిన ఫొటోను పోస్ట్ చేశాడు. షాహిద్ కపూర్ మీరా రాజ్ పూత్ ల లిప్ లాక్ దీపావళి శుభాకాంక్షల పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం అర్జున్ రెడ్డి చిత్రం రీమేక్ షూటింగ్ మూడ్ లో షాహిద్ కపూర్ ఉన్నాడు.తెలుగు అర్జున్ రెడ్డి లో ఏ రేంజ్ లో ముద్దు సీన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీ రీమేక్ లో అంతకు మించి ఉంటాయని తెలుస్తోంది. హిందీలో ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ తో రూపొందుతున్న అర్జున్ రెడ్డి ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయ్యింది. తాను చేయబోతున్న సినిమాలో ముద్దు సీన్స్ దండిగా ఉంటాయని చెప్పేందుకు సింబాలిక్ గా షాహిద్ కపూర్ ఇలాంటి పోస్ట్ పెట్టి ఉంటాడు అనిపిస్తుంది. షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పూత్ అందంలో బాలీవుడ్ హీరోయిన్స్ ను మించి ఉంటుందనే టాక్ ఉంది. ఎంతో మంది బడా నిర్మాతలు ఆమెను హీరోయిన్ గా తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. బాలీవుడ్ స్టార్ హీరోలందరిలో అందమైన భార్యను కలిగి ఉన్న హీరో అంటూ షాహిద్ కపూర్ గురించి కొందరు సోషల్ మీడియాలో అనుకుంటూ ఉంటారు.

తన అందమైన భార్యను షాహిద్ కపూర్ చాలా ప్రేమిస్తాడు. అందుకే ఇలా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశాడు. అయితే సోషల్ మీడియాలో ముద్దు ఫొటో పోస్ట్ చేయడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా మరి కొందరు మాత్రం షాహిద్ మీరా రాజ్ పూత్ ల ప్రేమను వావ్ అనుకుంటున్నారు. మొత్తానికి షాహిద్ మీరాల ముద్దు ఫొటో సోషల్ మీడియాను ఒక కుదుపు కుదిపేసేంతగా వైరల్ అవుతోంది.