Begin typing your search above and press return to search.

జెర్సీతో అవార్డులు కొట్టేందుకు రెడీ అవుతున్నాడ‌ట‌

By:  Tupaki Desk   |   20 Oct 2020 5:00 AM GMT
జెర్సీతో అవార్డులు కొట్టేందుకు రెడీ అవుతున్నాడ‌ట‌
X
తెలుగు హిట్ చిత్రం జెర్సీని షాహిద్ కపూర్ క‌థానాయ‌కుడిగా హిందీలో రీమేక్ చేస్తున్న‌ విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఒరిజినల్ ని డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి హిందీ వెర్షన్ ‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్ర‌స్తుతం షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ జోరందుకుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం... షాహిద్ కపూర్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారని తెలుస్తోంది.

కబీర్ సింగ్ విజయంపై అతను హోప్ తో ఉన్నాడు. మ‌రోసారి అర్జున్ రెడ్డి రీమేక్ క‌బీర్ సింగ్ కి ద‌క్కిన‌ట్టే జెర్సీ హీరోగా మంచి గుర్తింపు ద‌క్కించుకోవాల‌ని క‌సిగా న‌టించాడ‌ట షాహిద్. క్రికెట‌ర్ గా షాహిద్ పెర్ఫామెన్స్ రియ‌ల్ క్రికెట‌ర్ నే త‌ల‌పిస్తుంద‌ట‌. మాతృక‌లో నాని సైతం ఇదే తీరుగా మెప్పు పొందాడు. కాన్సెప్ట్ ఆద్యంతం ఎంత‌ నేచుర‌ల్ గా ఉంటుందో షాహిద్ న‌ట‌న అంతే నేచుర‌ల్ గా ఉంటుంద‌ని స‌మాచారం‌.

నాని త‌న స‌హ‌జ‌సిద్ధ‌మైన న‌ట‌న‌కు తెలుగు ప్రేక్ష‌కుల మెప్పు పొందాడు. అలాగే షాహిద్ అద్భుతమైన ప్రదర్శన కు హిందీ ప్రేక్ష‌కులు జేజేలు ప‌లుకుతార‌న్న అంచ‌నా ఏర్ప‌డింద‌ట‌. ఆశించిన‌ది జ‌రిగితే మ‌రోసారి షాహిద్ కి అవార్డులు ద‌క్క‌వ‌చ్చ‌న్న అంచ‌నా వేస్తున్నారు.