హిందీ ‘జెర్సీ’కి టీం ఇండియా క్రికెటర్ల సహకారం

Tue Jul 07 2020 11:00:50 GMT+0530 (IST)

Shahid Kapoor Gets Trained By Rohit Sharma Coach For Jersey

నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ గా కూడా పర్వాలేదు అనిపించింది. నాని నటన మరియు దర్శకుడి స్క్రీన్ ప్లే సినిమా కు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల కంటే బాలీవుడ్ ప్రేక్షకులకు ఎక్కువ గా ఎక్కుతుంది అనే ఉద్దేశ్యం తో దిల్ రాజు మరియు అల్లు అరవింద్ లు కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థతో హిందీలో రీ మేక్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.తెలుగు అర్జున్ రెడ్డి ని హిందీ లో కబీర్ సింగ్ గా చేసిన షాహిద్ కపూర్ ను జెర్సీ రీమేక్ లో నటింపజేస్తున్నారు. క్రికెట్ తో పెద్దగా టచ్ లేని షాహిద్ కపూర్ ఈ రీమేక్ కోసం చాలా రోజులు గా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రముఖ రంజీ క్రికెటర్స్ తో పాటు జాతీయ స్థాయి క్రికెటర్స్ వద్ద షాహిద్ కపూర్ క్రికెట్ పాఠాలు నేర్చుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.

కొన్ని రోజుల క్రితం రోహిత్ శర్మ వద్ద క్రికెట్ గురించిన విషయాలను నేర్చుకుంటున్నట్లుగా షాహిద్ కపూర్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ కు వ్యక్తిగత శిక్షకుడు అయిన దినేష్ లాడ్ వద్ద శిక్షణ పొందుతున్నాడట. వీరివద్దే కాకుండా ఇంకా పలువురు టీం ఇండియా క్రికెటర్ల వద్ద కూడా షాహిద్ కపూర్ ట్రైనింగ్ తీసుకోబోతున్నట్లు గా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభం లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. అప్పటి వరకు షాహిద్ కపూర్ క్రికెట్ పై పూర్తి పట్టు సాధించేలా శిక్షణ పొందే అవకాశముంది.