షాక్: విడాకుల దిశగా ప్రముఖ టీవీ నటి!

Sun Jul 03 2022 11:00:38 GMT+0530 (IST)

Shagun actress Surbhi Tiwari files complaint against husband

ఇటీవల సెలబ్రిటీ వరల్డ్ లో వరుస విడాకులు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నాగచైతన్య- సమంత.. అమీర్ ఖాన్ - కిరణ్ రావు.. జానీ డెప్- అంబర్ హర్ట్.. ఇలా అన్ని పరిశ్రమల్లోనూ ఇదే తంతు. ఇప్పుడు హిందీ పరిశ్రమలో మరో విడాకులు హాట్ టాపిక్ గా మారింది.2019లో పైలట్ కం వ్యాపారవేత్త ప్రవీణ్ కుమార్ సిన్హాని ప్రముఖ హిందీ టీవీ నటి సురభి తివారీ పెళ్లాడింది. ఇప్పుడు మూడు సంవత్సరాల తరువాత సదరు నటీమణి విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. ప్రవీణ్ అతని కుటుంబీకులు తనపై గృహ హింసకు పాల్పడ్డారని కూడా ఆరోపించింది. తాజా కథనాల ప్రకారం.. ముంబైకి మకాం మార్చడానికి తన భర్త నిరాకరించాడని.. అతడు తన మాటను వెనక్కి తీసుకున్నాడని వరుస ప్రయాణాల కారణంగా టీవీ ఆఫర్లు లేకుండా పోయాయని ఆమె పేర్కొంది. అత్తమామలు -భర్త గృహ హింసకు పాల్పడ్డారని నటి సురభి ఆరోపించింది

తాజా ఇంటర్వ్యూలో సురభి తివారీ తన వివాహంలో తప్పు ఒప్పుల గురించి నిజాయితీగా మాట్లాడింది. ఆమె తన పోరాటాన్ని వివరించింది. ``ప్రవీణ్ నాతో కలిసి జీవించడానికి ముంబైకి రావడానికి అంగీకరించాడు. కానీ తరువాత మకాం మార్చడానికి నిరాకరించాడు. నేను నటనను కొనసాగించాలనుకున్నాను. కానీ నేను అతనితో కలిసి ప్రయాణించడం వల్ల రోజువారీ ఎపిసోడ్స్ చిత్రీకరణకు ఎటెండ్ కాలేకపోతున్నాను. దీంతో అతనిపై ఆర్థికంగా ఆధారపడి డబ్బుల కోసం నానా తంటాలు పడ్డాను. అంతేకాకుండా.. నేను త్వరలో కుటుంబాన్ని ప్రారంభించాలనుకున్నాను.. కానీ అతను ఆసక్తి చూపలేదు`` అని అన్నారు.

ఆ ఇంటర్వ్యూలో తన అత్తగారు.. భర్త .. కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది. గృహ హింసకు పాల్పడడమే గాక..  నన్ను బెదిరించినందుకు  ప్రవీణ్ అతని తల్లి అతని కోడలుపై నేను ఫిర్యాదు చేసాను. అలాగే నేను నా ఆభరణాలను తిరిగి పొందలేదు. వాటిని తిరిగి పొందడం నా హక్కు. పెళ్లిలో మావాళ్లు ఇచ్చిన నగలతో పాటు వెండి వస్తువులు కూడా తీసుకెళ్లాను. నేను ఏమీ తిరిగి తీసుకురాలేదు`` అని తెలిపారు.

పెళ్లి తర్వాత తాను చాలా విషయాల్లో మోసపోయానని కూడా ఆ ఇంటర్వ్యూలో వివరించింది. తాను స్నేహపూర్వకంగా విడిపోవాలనుకుంటున్నానని ఆమె అంగీకరించింది. అయితే ఆమె భర్త ఆమెకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించినందున ఆమె చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకోవలసి వచ్చింది. త్వరలో విడాకుల కోసం దరఖాస్తు చేస్తానని ఆమె తేల్చి చెప్పింది.

కహానీ ఘర్ ఘర్ కియీ- కుంకుమ్ - ఏక్ ప్యారా సా బంధన్ - అగ్లే జనమ్ మోహే బితియా హి కిజో వంటి కొన్ని పాపులర్ సీరియళ్లలో నటించిన సురభి తివారీ కి `షగున్` మంచి పేరు తెచ్చింది. ఇందులో ఆమె ఆరాధన అనే ప్రధాన పాత్రను పోషించింది.