Begin typing your search above and press return to search.

దిల్‌ రాజు 'షాదీ ముబారక్‌'

By:  Tupaki Desk   |   30 Sep 2020 1:30 AM GMT
దిల్‌ రాజు షాదీ ముబారక్‌
X
టాలీవుడ్‌ లో ఎన్నో బిగ్గెస్ట్‌ సూపర్‌ హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన శ్రీ వెంకటేశ్వర ఫిలింస్‌ వారు కొత్త వారితో ఒక చిన్న సినిమాను ప్రకటించింది. దిల్‌ రాజు ఈమద్య కాలంలో సినిమాల ఎంపిక విషయంలో మరింతగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక వైపు పవన్‌ కళ్యాణ్‌ వంటి స్టార్‌ హీరోతో సినిమాను నిర్మిస్తూనే మరో వైపు కొత్త వారితో 'షాదీ ముబారక్‌' అనే సినిమాను కూడా దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌ లోగోను నేడు ఆవిష్కరించారు. రేపు ఉదయం 11 గంటలకు ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

షాదీ ముబారక్‌ లో సాగర్‌ ఆర్కే నాయుడు హీరోగా ద్రిశ్య హీరోయిన్‌ గా నటిస్తున్నారు. ఇద్దరు కూడా కొత్త వారే అయినా కూడా దిల్‌ రాజు బ్యానర్‌ లో రూపొందుతున్న సినిమా అవ్వడం టైటిల్‌ విభిన్నంగా ఉండటం వంటి కారణంగా 'షాదీ ముబారక్‌' పై ప్రేక్షకులు అప్పుడే ఆసక్తి పెంచుకుంటున్నారు. పద్మశ్రీ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమాకు సునీల్‌ కశ్యప్‌ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాను స్పీడ్‌ గా పూర్తి చేసి ఓటీటీలో విడుదల చేస్తారా లేదంటే థియేటర్‌ లోనే దిల్‌ రాజు విడుదల చేయనున్నాడా అనేది చూడాలి.