Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU లీక్‌ : ఎలిమినేషన్‌లో ఈవారం ఏడుగురు

By:  Tupaki Desk   |   13 Sep 2021 12:30 PM GMT
#BIGGBOSS5TELUGU లీక్‌ : ఎలిమినేషన్‌లో ఈవారం ఏడుగురు
X
తెలుగు బిగ్‌ బాస్ నుండి లీక్ లు మాత్రం ఆగడం లేదు. ఎలిమినేషన్‌ అయ్యేది ఎవరు అనే విషయం ముందు రోజే తేలిపోతుంది. గత సీజన్ మాదిరిగా ఈ సీజన్ లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ అయ్యేది ఎవరు అనే విషయం శనివారం రోజే తేలిపోయింది. లీక్ అయినట్లుగానే బిగ్ బాస్ సీజన్ 5 నుండి సరయు ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్‌ 5 లో సోమవారం ఎపిసోడ్‌ లో ఎలిమినేషన్ కు నామినేట్‌ అయ్యేది ఎవరు కూడా లీక్ అవుతుంది. నేడు ప్రసారం అవ్వబోతున్న ఎపిసోడ్‌ కు సంబంధించి నిన్ననే టాస్క్ లు జరుగుతాయి. కనుక ఒక రోజు ముందు గా లేదా ఆ రోజు ఉదయం అయినా నామినేట్‌ అయ్యేది ఎవరు అనే విషయాన్ని లీక్ చేస్తున్నారు.

షో పై ఆసక్తిని పెంచేందుకు ఇలా చేస్తున్నారా లేదంటే స్టార్‌ మాకు చెందిన వారు ఎవరైనా ఈ పని చేస్తున్నారా అనేది అనుమానంగా ఉంది. ఏది ఏమైనా సోషల్‌ మీడియా ఫాలో అయ్యేవారికి మాత్రం ఈ లీక్ లు మంచి మజాను ఇస్తున్నారు. ఎపిసోడ్‌ చూడాలనే ఆసక్తి కలిగిస్తుంది. బిగ్‌ బాస్ ఈసారి ఎలిమినేషన్‌ పక్రియ చాలా విభిన్నంగా ప్లాన్ చేశాడు. అందులో భాగంగా ఇంటి సభ్యులు మొత్తం కూడా రెండు జట్లుగా విడిపోయారు. తద్వారా ఎలిమినేషన్ ను ప్లాన్‌ చేశారు. నామినేషన్ లో ఈసారి ఏడు మంది ఉన్నట్లుగా లీక్ అయ్యింది. ఆ ఏడుగురు కూడా చాలా నాటకీయ పరిణామాల మద్య నామినేట్‌ అయ్యారని అంటున్నారు. ఎలిమినేషన్ కు నామినేట్‌ అయిన వారిలో ఉమాదేవి.. లోబో.. ప్రియాంక... నటరాజ్ మాస్టర్‌.. ఆర్‌ జే కాజల్‌.. యానీ మాస్టర్‌.. ప్రియాలు ఉన్నారు.

ప్రోమో చూస్తుంటే ఈ రోజు ఎపిసోడ్ రచ్చ రచ్చగా ఉంటుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా వారం రోజుల పాటు చాలా సైలెంట్‌ గా ఉన్న శ్వేత వర్మ ఈసారి చాలా సీరియస్ గా రియాక్ట్‌ అయ్యింది. తనకు ఇచ్చిన ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌ ను కూడా తీసేసేంత కోపం ఆమెకు ఎందుకు వచ్చింది అనేది ఎపిసోడ్‌ చూస్తే కాని తెలియదు. ఎపిసోడ్‌ ఖచ్చితంగా చేసే విధంగా ప్రోమో ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రోమోలో ఉన్నంత డ్రామా ఫుల్‌ ఎపిసోడ్‌ లో ఉంటుందా లేదంటే అంతా ఉత్తదే అంటూ తేల్చి పారేస్తారా అనేది చూడాలి. ముందు ముందు రచ్చ రచ్చ ఖాయం అన్నట్లుగా ఉంది.