Begin typing your search above and press return to search.

శృంగార తార మియా మాల్కోవా దెబ్బకి సర్వర్స్ క్రాష్...!

By:  Tupaki Desk   |   7 Jun 2020 8:30 AM GMT
శృంగార తార మియా మాల్కోవా దెబ్బకి సర్వర్స్ క్రాష్...!
X
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలమే అని చెప్పాలి. 'శివ' సినిమాతో టాలీవుడ్ లో పెను మార్పులకు కారణమయ్యాడు వర్మ. అప్పటి వరకూ మూసధోరణిలో వెళ్తున్న సినీ ఇండస్ట్రీకి కొత్త దారి చూపించాడు. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో.. అసాధారణమైన కెమెరా యాంగిల్స్ తో.. కొత్త సౌండింగ్ తో చరిత్ర నిలిచిపోయే విధంగా 'శివ' సినిమా ఇచ్చాడు ఆర్జీవీ. అప్పటి నుండి ప్రతీ సినిమాలో ఏదొక కొత్త విషయంతో ముందుకొస్తున్నాడు. సినిమా అట్టర్ ప్లాప్ అయినా కూడా వర్మ వినూత్నమైన ఆలోచన గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతకముందు 5డీ కెమెరాతో సినిమా తీయొచ్చిన చూపించిన వర్మ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఇప్పుడు అందరూ ఓటీటీ అంటుంటే లేటెస్టుగా వర్మ ఏటీటీతో ముందుకొచ్చాడు. శ్రేయాస్ మీడియా సంస్ధ ఆన్ లైన్ థియేటర్ పేరిట చేసిన ప్రయోగానికి వర్మ జత కలిసాడు. ఆర్జీవీ వరల్డ్ పేరుతో శ్రేయాస్ ఎంటర్టైన్మెంట్స్ ఏటీటీలో తన సినిమా 'క్లైమాక్స్'ని విడుదల చేసాడు.

గత రెండు నెలలుగా లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ క్లోజ్ అయి సినిమాలు రిలీజ్ కాలేదు. దీంతో ఆర్జీవీ - శ్రేయాస్ వారు స్టార్ట్ చేసిన 'ఎనీ టైమ్ థియేటర్' కాన్సెప్ట్ కు మంచి స్పందన వచ్చింది. 'క్లైమాక్స్' సినిమా కోసం 50 వేల మంది ఒకేసారి చూసే కెపాసిటీతో సర్వర్ లను శ్రేయాస్ మీడియా వారు సిద్ధం చేసారు. అయితే ఒక్కసారిగా ట్రాఫిక్ పెరిగిపోవడంతో సర్వర్స్ క్రాష్ అయ్యాయి. ఆర్జీవీ సినిమా చూడాలని ఆతృతగా లాగిన్ అయి వెయిట్ చేసిన చాలా మంది అప్లికేషన్ ఓపెన్ అవ్వక సోషల్ మీడియాలో శ్రేయాస్ మీడియా వారిని అర్జీవిని ఓ రేంజ్ లో కామెంట్స్ తో ఆడుకున్నారు. ప్రమోషన్స్ మీద పెట్టిన శ్రద్ధ అప్లికేషన్ మీద పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని విమర్శించారు. దీంతో శ్రేయాస్ వారు అప్పటికప్పుడు లక్షా పాతిక వేలకి సర్వర్ కెపాసిటీని పెంచారు. సినిమా చూసే ఆసక్తిని రెండున్నరలక్షలకు మంది పైగా కనబర్చడంతో మళ్లీ సర్వర్ క్రాష్ అయింది. దాంతో మళ్లీ అప్ డేట్ చేసారు. అయినా మూడు లక్షల మంది పైగా సినిమా చూడాలని ఆసక్తిని కనబర్చడంతో మళ్లీ సర్వర్ క్రాష్ అయింది. దాంతో మళ్లీ అప్ డేట్ చేయాల్సి వచ్చింది.

కాగా ఈ సందర్భంగా శ్రేయాస్ మీడియా వారు మాట్లాడుతూ ఇంత స్పందన వస్తుందని ఊహించలేదని అన్నారు. రెండు లక్షల డెభై అయిదు వేల మంది 'క్లైమాక్స్' సినిమాను తమ ఏటీటీలో చూసారని ఇది నిజంగా అద్భుతమని అన్నారు. ఎన్నో థియేటర్లలో విడుదల చేస్తే తప్ప ఇంత మంది చూడడం అసాధ్యమని.. అలాంటిది ఒక్క వినూత్నమైన కాన్సెప్ట్ తో ఇంతమంది చూసేలా చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా మరిన్ని వైవిధ్యమైన సినిమాలు త్వరలోనే అందుబాటులో ఉంచుతామని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై నెటిజన్స్ మాత్రం రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద సినిమాలని కూడా ఒకేసారి అంతమంది చూసే అవకాశం లేదు. కేవలం రెండు మూడు రోజుల్లో ఎక్కువ మంది చూస్తారని పబ్లిసిటీ కోసమే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారని డౌట్ వ్యక్తం చేస్తున్నారు.