యాంకర్ అనసూయ ఇంట్లో తీవ్ర విషాదం

Sun Dec 05 2021 14:05:22 GMT+0530 (IST)

Serious tragedy in the house of anchor Anasuya

జబర్ధస్త్ యాంకర్ ప్రముఖ టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. ఈమె ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అనసూయ తండ్రి సుదర్శన్ రావు అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలిసి కన్నీరు మున్నీరైంది అనసూయ.హైదరాబాద్ తార్నాకలో అనసూయ తల్లిదండ్రులు ఉంటారు. అక్కడే కొన్నాళ్లుగా ఉంటున్నారు. అనసూయ తండ్రి సుదర్శన్ రావు తన సొంత నివాసంలోనే తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 5 ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన అనసూయతండ్రి ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.

సుదర్శన్ రావు మరణవార్త తెలిసిన వెంటనే ఇండస్ట్రీలోని ప్రముఖులు అనసూయకు ఫోన్ చేసి పరామర్శించారు. తమ సంతాపం తెలిపారు. ధైర్యంగా ఉండాలని సూచించారు.

కాగా సుదర్శన్ రావు గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నారు. అలాగే సమాజ సేవలోనూ ఆయన ముందుండే వారు. తండ్రి మరణంతో యాంకర్ అనసూయ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. విషయం తెలిసినప్పటినుంచి కన్నీరు పెడుతూనే ఉంది.