అఖండకు సీక్వెల్.... ?

Wed Dec 08 2021 10:00:01 GMT+0530 (IST)

Sequel For Akhanda

ఇపుడు ఏ నోట విన్నా అఖండ గురించే. అంతటా అఖండ మాటే. అంతలా ఈ మూవీ సక్సెస్ అయింది. బ్లాక్ బస్టర్ కి అసలైన  అర్ధం చెబుతూ కలెక్షన్ల దూకుడు చేస్తోంది. బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ మూవీ రీ సౌండ్ చేస్తూ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా  రికార్డులు క్రియేట్ చేస్తోంది.దాంతో బాలయ్య ఫ్యాన్స్ ఆకలి మొత్తాన్ని డైరెక్టర్ బోయపాటి తీర్చేశారు. బాలయ్య ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక ఇబ్బంది పడ్డారు.  కరెక్ట్ కంటెంట్  ఉంటే కనుక  బాలయ్య మార్క్ మ్యాజిక్ ఎలా ఉంటుందో బోయపాటి ఆచరణలో చూపించారు.

దీంతో బాలయ్య ఫ్యాన్స్ మళ్లీ మా హీరోతో మూవీ ఎపుడు సార్ అంటూ బోయపాటిని అడుగుతున్నారు. బొమ్మ ఇంకా థియేటర్లో ఉండగానే బాలయ్యతో మరో సినిమా చేయండి అంటూ తెగ  రిక్వెస్ట్ చేస్తున్నారు.

డబుల్ హ్యాట్రిక్ కి రెడీ కావాలని కూడా తొందరపెడుతున్నారు. మరి ఫ్యాన్స్ కోసమా లేక నిజంగా ప్రాజెక్ట్ ఉందా తెలియదు కానీ ఇపుడు అఖండ సీక్వెల్ అంటూ ప్రచారం అయితే వచ్చింది. ఇది సీక్వెల్ తరం కాబట్టి నిజమైనా అవవచ్చు అన్న వారూ ఉన్నారు. అఖండ మూవీలో నేనే  అంటూ బాలయ్య విశ్వరూపం చూపించారు. ఎక్కడ చెడు జరిగినా తాను వస్తాను అని ఆయన చెప్పారు.

దాంతో సీక్వెల్ కధను అల్లుకోవడానికి ఎంతో స్కోప్ ఉంది అంటున్నారు. దాంతో బాలయ్యతో బోయపాటి కలసి సీక్వెల్ చేస్తారా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. అదే కనుక జరిగితే మాత్రం నందమూరి ఫ్యాన్స్ కి హుషారే హుషార్ అనుకోవాలి. ఏది ఏమైనా అఖండతో బాలయ్య బోయపాటి ఇటు ఫ్యాన్స్ కి అటు చిత్ర సీమకు కూడా పూర్తి ఉత్సాహం తీసుకువచ్చారనే చెప్పాలి.