హీరోయిన్ ని ముద్దులతో నలిపేసిన సెన్సేషనల్ డైరెక్టర్...!

Tue Jul 07 2020 16:40:51 GMT+0530 (IST)

Sensational director who kisses the heroine ...

సెన్సేనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏమి చేసినా సంచలనమే అనే విషయం అందరికి తెలిసిందే. ఇటీవల దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల్లో సినిమా షూటింగ్స్ అన్నీ అర్థాంతరంగా ఆగిపోవడంతో ఒక్క సినిమా కూడా బయటకి రాలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వర్మ అర డజను సినిమాలను అనౌన్స్ చేయడంతో పాటు ఇప్పటికే రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేసాడు. అయితే రామ్ గోపాల్ వర్మ తన చర్యలతో ఏదొక రకంగా సినిమాలకి హైప్ క్రియేట్ చేస్తుంటారు. టైటిల్ దగ్గర నుంచి నటించే ఆర్టిస్టుల వరకు కూడా వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ సినిమాకి కావలసినంత పబ్లిసిటీ రాబట్టుకుంటాడు. ఇటీవల 'నగ్నం' సినిమా కోసం శ్రీ రాపాక ని స్వీటీగా పరిచయం చేసిన వర్మ ఇప్పుడు అప్సర రాణి అనే యువతిని తెలుగు ఆడియెన్స్ కి పరిచయం చేసాడు. ఆమెతో 'థ్రిల్లర్' అనే సినిమా చేయబోతున్నట్లు ప్రకటించేశాడు వర్మ.అంతేకాకుండా ఆమెకు సంబంధించిన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నిమిషాల్లోనే వైరల్ అయ్యేలా చేశాడు. దీంతో అప్సర రాణి పేరు మీద క్రియేట్ చేసిన ట్విట్టర్ ఖాతాకు కొన్ని గంటల్లోనే 20.6K ఫాలోవర్స్ వచ్చి చేరారు. అప్సర రాణి ఒడిశాలో పుట్టిన ఈ అమ్మాయిని చూడగానే తనకు ఆ రాష్ట్రం మీద గౌరవం పెరిగిందని.. ప్రస్తుతం ఈ అప్సర హైదరాబాద్ లోనే ఉంటోందని వెల్లడించారు. నిజానికి అప్సర రాణి తెలుగులో 'ఉల్లాల ఉల్లాల' '4 లెటర్స్' అనే సినిమాల్లో నటించింది గాని ఆ సినిమాలు ఆమెకు పెద్దగా క్రేజ్ తీసుకురాలేకపోయాయి. ఇప్పుడు వర్మ దృష్టిలో పడి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

ఇదిలా ఉండగా నిన్నటి నుండి సోషల్ మీడియా మాధ్యమాల్లో వర్మ 'అప్సరస రాణి' గురించి నెటిజన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. వర్మ కూడా గ్యాప్ ఇవ్వకుండా అమ్మడి ఫొటోస్ షేర్ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో వర్మ ఆమెతో చనువుగా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. చనువు అంటే ఏకంగా ముద్దుపెట్టేసే అంత చనువు అన్నమాట. వర్మ ఈ ఫొటోలో ఆమెను గట్టిగా పట్టుకొని కిస్ పెట్టేసేసాడు. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ లోని కొంటె కృష్ణుడు బయటకి వచ్చాడని.. వర్మలో ప్లే బాయ్ వేషాలు మళ్ళీ బయటకి వస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద అప్సరతో ఆర్జీవి ఎంత చనువుగా ఉంటాడో ఈ ఫోటోలతో క్లారిటీ వచ్చేసింది. వర్మ అమ్మాయిలని ముద్దుపెట్టుకోవడం ఇదేమీ కొత్త కానప్పటికీ కొత్త అమ్మాయి అవడంతో అందరూ ఆసక్తి కనబరిచారు. మరి ఈ సినిమా కంప్లీట్ అయ్యేలోపు ఎన్ని ముద్దు సీన్స్ బయటపెడతాడో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.