Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ కూడా ఆల్టిమేట‌మ్ జారీ చేశాడు

By:  Tupaki Desk   |   17 May 2022 9:49 AM GMT
క‌మ‌ల్ కూడా ఆల్టిమేట‌మ్ జారీ చేశాడు
X
హిందీ భాషాపై సౌత్ లో తీవ్ర వ్య‌తిరేక‌త‌ మొద‌ల‌వుతోంది. గ‌త కొంత కాలంగా త‌మిళనాడుపై హిందీ భాష‌ని బ‌ల‌వంతంగా రుద్దాల‌ని కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోందంటూ గ‌త కొంత కాలంగా త‌మిళ వ‌ర్గాలు విమ‌ర్శ‌లు చేస్తూనే వున్నాయి. తాజాగా విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ఏకంగా హిందీ భాష పై ఆల్టిమేజ‌మ్ జారీ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. త‌మిళానికి అడ్డొస్తే హిందీని వ్య‌తిరేకించ‌క త‌ప్ప‌దంటూ తీవ్రస్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు క‌మ‌ల్ హాస‌న్‌.

వివ‌రాల్లోకి వెళితే.. క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన తాజా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'విక్ర‌మ్‌'. లోకేష్ క‌న‌గ‌రాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని క‌మ‌ల్ కు చెందిన రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మించింది. మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి, మ‌ల‌యాళ స్టార్ ఫాహ‌ద్ ఫాజిల్, న‌రేష్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని కీల‌క అతిథి పాత్ర‌లో హీరో సూర్య‌, అమితాబ్ బ‌చ్చ‌న్ జూన్ 3న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల కానుంది.

ఈ సంద‌ర్భంగా సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర బృందం చెన్నైలో ట్రైల‌ర్‌, సాంగ్స్ రిలీజ్ కార్య‌క్ర‌మాన్ని చెన్నైలో నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్లడించిన క‌మ‌ల్ హాస‌న్ హిందీ భాష పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సినిమా.. రాజ‌కీయాలు క‌వ‌ల పిల్ల‌లు..అదే నును చేస్తున్నా. త‌మిళం వ‌ర్థిల్లాలి అని చెప్ప‌డం నా భాధ్య‌త‌. దీనికి ఎవ‌రు అడ్డు వ‌చ్చినా ఎదుర్కొంటా. దీనికి రాజ‌కీయాల‌కు ఎలాంటి సంబంధం లేదని స్ప‌ష్టం చేశారు.

అంతే కాకుండా మాతృభాష‌ను మ‌రువ‌కండ‌న్నారు. ఇదే స‌మ‌యంలో తాను హిందీకి వ్య‌తిరేకిని అని చెప్ప‌ను అంటూనే గుజ‌రాతీ, చైనీష్ భాష‌ల‌ను కూడా మాట్లాడండి అని చెప్పుకొచ్చారు. ఇటీవ‌ల క‌న్న‌డ స్టార్ సుదీప్ హిందీ భాష ఎంత మాత్ర‌ము ఇక జాతీయ భాష కాద‌ని వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఇదే త‌ర‌హాలో క‌మ‌ల్ హాస‌న్ హిందీ భాష‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన తాజా చిత్రం 'విక్ర‌మ్‌'. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీని లోకేష్ క‌గ‌రాజ్ తెర‌కెక్కించారు. జూన్ 3న భారీ స్థాయిలో విడుద‌ల కానున్న నేప‌థ్యంలో క‌మ‌ల్ హాస‌న్ హిందీ భాషా వివాదంపై స్పందించ‌డం.

త‌న త‌మిళ భాష‌కు అడ్డ‌ప‌డితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా వున్నాన‌ని క‌మ‌ల్ హాస‌న్ ఆల్టిమేట‌మ్ జారీ చేయడం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి క‌మ‌ల్ వ్యాఖ్య‌ల‌పై బాలీవుడ్ ప్ర‌ముఖులు స్పందిస్తారా? లేక భార‌తీయ జ‌న‌తా పార్టీ వ‌ర్గాలు స్పందిస్తాయా? అన్న‌ది వేచి చూడాల్సిందే.