Begin typing your search above and press return to search.

సీనియర్ స్టార్ హీరోల సినిమాలు ఏ వేదికపై రిలీజ్ చేస్తారు...?

By:  Tupaki Desk   |   1 Oct 2020 2:30 AM GMT
సీనియర్ స్టార్ హీరోల సినిమాలు ఏ వేదికపై రిలీజ్ చేస్తారు...?
X
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి - కింగ్ నాగార్జున - విక్టరీ వెంకటేష్ - నందమూరి బాలకృష్ణ నలుగురి సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. కరోనా కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇన్నాళ్లు బ్రేక్ తీసుకున్న ఈ హీరోలు తిరిగి షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే నాగార్జున నటిస్తున్న 'వైల్డ్ డాగ్' సినిమా షూటింగ్ ప్రారంభించాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నారు. వాస్తవ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న ఈ సినిమాతో అహిషోర్ సాల్మోన్ ని డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ జరుగునున్న 'వైల్డ్ డాగ్' చిత్రాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చేస్తారేమో అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మరి కొత్తదనాన్ని ఆహ్వానించడానికి ఎప్పుడు ముందుడే నాగ్.. తన సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తారా లేదా థియేటర్స్ రీ ఓపెన్ చేసే దాకా వెయిట్ చేస్తాడా అనేది చూడాలి.

మరో సీనియర్ హీరో వెంకటేష్ నటించిన 'నారప్ప' సినిమా కూడా చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. తమిళ్ లో ధనుష్ నటించిన 'అసురన్' అనే సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ చేసి మిగతా చిత్రీకరణ పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సురేష్ బాబు ఇప్పటికే రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేసిన నేపథ్యంలో థియేటర్స్ ఇంకొన్ని రోజులు రీ ఓపెన్ చేయకపోతే 'నారప్ప'ని డిజిటల్ రిలీజ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

ఇక సూపర్ సీనియర్ మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కి టైమ్ ప‌ట్టే అవ‌కాశం ఉండటంతో థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుందని చెప్పవచ్చు. బాలయ్య - బోయ‌పాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓకే షెడ్యూల్ మాత్రమే షూటింగ్ జరుపుకుంది. ఇప్పుడు చిత్రీకరణ స్టార్ట్ చేసినా కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ కంప్లీట్ చేయడానికి సమయం పడుతుంది. అప్పటికి థియేటర్స్ తెరిచే ఛాన్స్ ఉంది కాబట్టి బాలయ్య మూవీ కూడా థియేటర్ రిలీజ్ అవుతుందని చెప్పవచ్చు.