టబూ ఆ పనిచేసిందట.. సీక్రెట్ రివీల్

Sun Sep 25 2022 22:00:30 GMT+0530 (India Standard Time)

Senior actress Tabu revealed a big secret

సినీ ప్రముఖల రహస్యాలపై సహజంగానే జనాల్లో బోలెడంత ఆసక్తి ఉంటుంది. నటీమణుల వ్యక్తిగత జీవితాలంటే ఇక చెవికోసుకుంటారు. వారి రహస్యాలను ఎంజాయ్ చేస్తారు. చాలా మంది పబ్లిక్ ఫిగర్స్తమ జీవితాలను గోప్యంగా ఉంచుతారు. బయటపడితే మాత్రం సోషల్ మీడియాలో పెద్ద రచ్చనే. ట్రోలింగ్ తప్పదు.అయితే తాజాగా సీనియర్ నటి టబు పెద్ద సీక్రెట్ ను బయటపెట్టి దుమారం రేపింది. ఇంత వయసు పెరిగినా పెళ్లి చేసుకోని ఈ అమ్ముడు లేటు వయసులోనూ ఘాటుగా నటిస్తోంది. ఇక మాటల మంటలు రేపడంలోనూ ఆమె ముందుంటోంది. ఓసారి తాను రూ.50వేల ఖరీదు చేసే ఫేస్ క్రేమ్ ను కూడా కొన్నానంటూ ఆమె హాట్ సీక్రెట్ చెప్పింది. నా అందానికి రహస్యం అదేనని చెప్పుకొచ్చింది. అందం కోసం సాధారణ పద్ధతులను అవలంభిస్తానని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పింది. హెల్దీగా ఉండేందుకే తనవంతు కృషి చేస్తానని చెప్పుకొచ్చింది. ప్రత్యేక కసరత్తులు ఏమీ చేయనని స్పష్టం చేసింది.

ప్రస్తుతం టబూ హిందీలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తోంది.  బాలీవుడ్ లో 'భూల్ భూలయ్యా2' సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉంది. మరిన్ని ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. దృశ్యం2 సినిమా కోసం అజయ్ దేవగణ్ తో కలిసి నటిస్తోంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ సినిమా ఖైదీ రిమేక్ లో నటిస్తోంది.

ఇంత వయసులోనూ తాను గ్లామర్ గా ఉండడానికి రూ.50వేల ఫేస్ క్రీమ్ కారణమని టబూ లీక్ చేసిన ఈ సీక్రెట్ మాత్రం వైరల్ అవుతోంది. అందం కోసం ఇంత ఖర్చు పెడుతోందా? ఈ భామా? అని ఆడిపోసుకుంటున్నారు. పెళ్లికి దూరంగా ఒంటరిగా ఉంటున్న ఈమె సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి పాత్రలతో రణాసి్తోంది.