సీనియర్ హీరో కృష్ణంరాజు ఆస్పత్రికి .. ఏమైంది?

Tue Sep 14 2021 14:10:09 GMT+0530 (IST)

Senior actor Krishnam Raju was admitted to the hospital

సీనియర్ హీరో కేంద్రమాజీ మంత్రి కృష్ణంరాజు హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. నిన్న సాయంత్రం కృష్ణంరాజు తమ ఇంటిలో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడిపోయినట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో ఆయన తుంటికి ఫ్రాక్చర్ అయినట్లు కథనాలు వెలువడ్డాయి.అపోలో వైద్యులు మంగళవారం ఉదయం కృష్ణం రాజు తుంటికి శస్త్రచికిత్స చేశారని.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు మీడియా వర్గాల్లో ప్రచారం జరిగింది.

కృష్ణంరాజు గారి ఆరోగ్యం బాగుందని.. కేవలం రోటీన్ హెల్త్ చెకప్ కోసం అపోలోకి వచ్చినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. సాయిధరమ్ తేజ్ కుటుంబ సభ్యులతో ఆరోగ్య పరిస్థితిపై చర్చించినట్టు తెలిపారు.త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని కృష్ణంరాజు గారు చెప్పారు.

త్వరలో యూకే వెళ్లాల్సి ఉన్నందున రోటీన్ హెల్త్ చెకప్ చేసుకోవడానికి అపోలోకి వచ్చినట్లు కృష్ణంరాజు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు కృష్ణంరాజు స్వస్థలం. రెబల్ స్టార్ గా తెలుగు ప్రేక్షకుల గుర్తింపు పొందిన కృష్ణంరాజు తన సుధీర్ఘ సినీ ప్రస్థానంలో 183 సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ఆయన వయసు 81 ఏళ్లు. 1966లో ‘చిలకా గోరింక’ చిత్రంతో కృష్ణంరాజు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 1990లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా కేంద్ర మంత్రిగా సేవలించారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నా అంత యాక్టివ్ గా లేరు.