Begin typing your search above and press return to search.

షాక్‌..ట్రాన్స్ జెండర్ గా సీనియర్ స్టార్‌ హీరోయిన్‌

By:  Tupaki Desk   |   6 Oct 2022 11:30 AM GMT
షాక్‌..ట్రాన్స్ జెండర్ గా సీనియర్ స్టార్‌ హీరోయిన్‌
X
మాజీ మిస్‌ యూనివర్శ్‌ సుస్మిత సేన్‌ హీరోయిన్ గా ఎన్నో సినిమా ల్లో నటించి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ గా నిలిచిన విషయం తెల్సిందే. కొన్నాళ్ల క్రితం వరకు నటనకు దూరంగా ఉండి కేవలం సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడు టీవీల్లో సందడి చేసిన సుస్మిత సేన్ ఇప్పుడు వరుసగా వెబ్‌ సిరీస్‌ ల్లో నటిస్తూ అభిమానులను మరియు ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది.

సుస్మిత సేన్‌ ఆర్య వెబ్‌ సిరీస్ లో నటించి సక్సెస్‌ దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆర్య వెబ్‌ సిరీస్‌ సూపర్‌ హిట్‌ అయిన తర్వాత వెంటనే ఆర్య 2 ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

ఈ రెండు వెబ్‌ సిరీస్‌ లతో సుస్మిత వద్దకు ఎన్నో వెబ్‌ సిరీస్ కథలు వచ్చాయి. వాటిల్లో కొన్ని కథలు నచ్చినా కూడా ఆమె ఆసక్తి లేక పోవడంతో నో చెప్పిందని సమాచారం అందుతోంది.

కానీ తాజాగా తాలి అనే వెబ్‌ సిరీస్ లో సుస్మిత సేన్ నటిస్తోంది. ఈ వెబ్‌ సిరీస్ లో ట్రాన్స్ జెండర్ గా ఈమె కనిపించబోతుంది. ముంబయికి చెందిన రియల్‌ ట్రాన్స్ జెండర్ కథ అనుసారంగా ఈ సినిమా రూపొందుతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా చిత్ర యూనిట్‌ సభ్యులు తెలియజేయడంతో పాటు వెబ్‌ సిరీస్ నుండి ఫస్ట్‌ లుక్‌ ను కూడా రివీల్‌ చేయడం జరిగింది.

గణేష్ గా పుట్టి గౌరీ సావంత్‌ గా మారిన ట్రాన్స్ జెండర్‌ కథ ఇది. మగ మరియు ఆడ తో పాటు మరో జెండర్ కూడా ఉండాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన గౌరీ సావంత్‌ కు కోర్టు లో విజయం దక్కింది. 2014 సంవత్సరంలో ట్రాన్స్ జెండర్స్ ని థర్డ్‌ జెండర్స్ గా గుర్తించాల్సిందిగా కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.

ఇప్పుడు ఆ గౌరీ సావంత్‌ పాత్రలో సుస్మిత సేన్‌ నటిస్తోంది. ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ స్పీడ్‌ గా సాగుతోంది. త్వరలోనే వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.