Begin typing your search above and press return to search.

ఆవిడ డిమాండ్ కి క‌ళ్లు తేలేస్తున్నార‌ట‌!

By:  Tupaki Desk   |   9 April 2020 5:50 AM GMT
ఆవిడ డిమాండ్ కి క‌ళ్లు తేలేస్తున్నార‌ట‌!
X
తాప‌ట్టిన కుందేటికి మూడే కాళ్లు అంటోందిట స‌ద‌రు సీనియ‌ర్ న‌టి. పున‌రారంగేట్రంలో అదిరిపోయే స‌క్సెస్ ఆయాచితంగా క‌లిసి రావ‌డంతో ఎందులోనూ త‌గ్గడం లేద‌ట‌. ఎవ‌రైనా నిర్మాత లేదా ద‌ర్శ‌కుడు త‌న‌ని క‌లిసేందుకు వెళితే ముందే త‌న కోర్కెల చిట్టా చెప్పేసి నీరు గార్చేస్తోంద‌ట‌. పారితోషికం స‌హా వ‌స‌తి విష‌యం అలానే ఎంచుకున్న క‌థ‌లో త‌న పాత్ర ప్రాముఖ్య‌త గురించి డీటెయిల్డ్ గా చెప్పేస్తోంద‌ట‌.

అయితే పాత్ర నిడివి మాటేమో కానీ పారితోషికం మాత్రం క‌ళ్లు భైర్లు క‌మ్మేలా చెబుతుండ‌డంతో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు క‌ళ్లు తేలేసేస్తున్నార‌ట‌. ఇక ఆవిడ‌తో ఇంకేం మాట‌లు .. వేరే వాళ్ల‌ను చూస్కుంటేనే బెట‌ర్ అంటూ చాలా మంది మిడిల్ డ్రాప్ అయిపోతున్నార‌ట‌. కార‌ణం ఏదైనా స‌ద‌రు సీనియ‌ర్ న‌టి ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం బాలేద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే స‌ద‌రు న‌టీమ‌ణి చాలా ముందే త‌న కండీష‌న్లు ఏమిటో క్లియ‌ర్ క‌ట్ గానే చెప్పారు. త‌న‌కు ఏ అసౌక‌ర్యం క‌లిగినా పారితోషికం స‌రిగా లేక‌పోయినా న‌టించ‌లేన‌ని భీష్మించుకు కూచుంటేనే ఆ కుర్ర డైరెక్ట‌ర్ ఏదో లా కాళ్లా వేళ్లా ప‌డి ఒప్పించాడు. పైగా హీరో కి ధీటుగా భారీ పారితోషికం ఆఫ‌ర్ చేయ‌డంతోనే స‌ద‌రు న‌టి రీఎంట్రీకి అంగీక‌రించింది.

ఇక తాను ఏదైనా పాత్ర‌కు అంగీక‌రించాలంటే హీరో త‌ర్వాత హీరో పాత్ర‌లా ఉండాల‌న్న‌ది స‌ద‌రు న‌టీమ‌ణి కండీష‌న్. అయితే అలాంటి క‌థ‌ల్ని రాసుకుంటేనే త‌న‌ని సంప్ర‌దించాల‌ని త‌న డిమాండ్ స్ప‌ష్ఠంగా అర్థ‌మ‌వుతోంది. మ‌రి అవ‌న్నీ తెలిసీ త‌న‌నే క‌ల‌వ‌డం ఎందుకు? మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు కూడా కాస్త‌యినా బుర్ర ప‌ని చేయాలి క‌దా! అన్న రివ‌ర్స్ కోటింగ్ ప‌డిపోతోంది ఇట్నుంచి. ఒక‌ప్పుడు లేడీ బాస్ గా రాజ్య‌మేలిన స‌ద‌రు న‌టీమ‌ణి బెట్టు వీడ‌డం నిజంగా క‌ష్ట‌మే. ఎందుకంటే త‌న‌ని కావాల‌ని పిలిచే వాళ్లు ఉన్న‌ప్పుడు అడ‌గ‌డంలో త‌ప్పేమీ లేదు క‌దా! అని త‌న‌ని కూడా స‌మ‌ర్థిస్తున్నారు. అన్న‌ట్టు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆఫ‌ర్ కోసం వేచి చూసిన త‌న‌కు ఆ ఒక్క ఛాన్స్ ద‌క్కిందా లేదా? అన్న‌ది క్లారిటీగా తెలియాల్సి ఉందింకా.