రాశి ఆర్థిక ఇబ్బందులు.. ఇది సంగతి

Mon Jun 01 2020 11:30:23 GMT+0530 (IST)

Senior Heroine Actress Rasi financial difficulties

సీనియర్ హీరోయిన్ రాశి ఆమద్య ఒక రేంజ్ లో సినిమాలు చేసింది. తెలుగులో మాత్రమే కాకుండా తమిళం కన్నడం మలయాళం చిత్రాల్లో నటించింది. హిందీలో కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించింది. అయితే ఈమె హీరోయిన్ గా లైఫ్ స్పాన్ చాలా తక్కువ కాలం సాగింది. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. హీరోయిన్ గా ఛాన్స్ లు లేని సమయంలో ఆర్థికంగా రాశి ఇబ్బందులు ఎదుర్కొందని ప్రచారం జరిగింది.ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం వల్లే ఎప్పుడు లేనిది నిజం సినిమాలో వ్యాంప్ పాత్రను పోషించిందని అప్పట్లో పుకార్లు వచ్చాయి. అప్పటి నుండి కూడా రాశి ఆర్థిక పరిస్థితుల గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆమె మళ్లీ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించడం.. బుల్లి తెరపై కనిపించేందుకు సిద్దం అవ్వడం అన్ని కూడా ఆర్థికంగా మెరుగు పడటం కోసమే అంటూ వార్తలు వచ్చాయి. ఇన్నేళ్లుగా మీడియాలో వస్తున్న వార్తలకు రాశి క్లారిటీ ఇచ్చింది.

తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈమద్య తన ఫ్యాన్స్ కు మరియు ప్రేక్షకులకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. ఇటీవల ఒక వీడియోలో తన ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతూ తాను కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతున్నాను. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. సింపుల్ గా హ్యాపీగా సాగిస్తున్నామంటూ చెప్పుకొచ్చింది. సమస్యలు వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిని దాటుకుంటూ ముందుకు సాగాలంటూ పేర్కొంది. తన జీవితంలో అన్ని రకాలుగా అనుభవాలను చవి చూసినట్లుగా పేర్కొంది. ప్రస్తుతానికి ఆర్థికంగా బాగానే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చింది.