సెట్ లో సీనియర్ హీరో 'ఇడియట్' గోల!

Fri Aug 12 2022 05:00:02 GMT+0530 (IST)

Senior Hero Is Playing A key Guest Role In The Young Hero Movie

చాలా వరకు సెట్ లో ఏం జరుగుతుంటుందో.. ఏ ఏ ఆర్టిస్ట్ లు ఎలా రియాక్ట్ అవుతుంటారో బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. తెలిసే అవకాశాలు చాలా తక్కువ. ఇండస్ట్రీలో మాత్రం ఏ సినిమా తెర వెనుక ఏం జరుగుతోంది?.. ఏ సెట్ లో ఎవరు ఎలా వుంటున్నారు? టైమ్ కి షూటింగ్ జరుగుతోందా?.. డైరెక్టర్ ని తన వర్క్ ని సజావుగా చేసుకోనిస్తున్నారా? ఆర్టిస్ట్ ల పరిస్థితి ఏంటీ? అన్నది చాలా వరకు సీక్రెట్ గానే వుంటూ వుంటుంది.అలాంటి విషయాలు తెలుసుకోవాలని సినీ ప్రియులతో పాటు ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అలాంటి ఓ ఆసక్తికర విషయమే తాజాగా బయటికి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఓ యంగ్ హీరో సినిమాలో సీనియర్ హీరో  కీలక అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ గత కొన్ని నెలలుగా జరుగుతోంది. కీలక ఘట్టాలకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.

దీంతో సినిమా దాదాపుగా సగ భాగం షూటింగ్ ని పూర్తి చేసుకుందట. అయితే సదరు సీనియర్ హీరో పాత్ర పరంగా తనకు క్లారిటీ రావడం లేదట. దీంతో ఏం జరుగుతోంది? .. డైరెక్టర్ చెప్పింది ఏంటీ? ఇక్కడ జరుగుతోంది ఏంటీ? అనే కన్ఫ్యూజన్ సదరు సీనియర్ హీరోలో మొదలైందట.

ఈ విషయంలో స్పష్టత కోసం దర్శకుడిని సంప్రదించాలని సదరు సీనియర్ హీరో ప్రయత్నిస్తే దర్శకుడు మాత్రం అతనికి చిక్కడం లేదట.

ఎంత ప్రయత్నించినా తప్పించుకు తిరుగుతున్నాడట. సెట్ లో వుండి కూడా తన వద్దకు రావడానికి తను తన దగ్గరికి వెళితే కలవడానికి సదరు డైరెక్టర్ సాహసించడం లేదట. దీంతో సీనియర్ హీరోకి చిర్రెత్తు కొస్తోందని చెబుతున్నారు. ఎంత ప్రయత్నించినా దర్శకుడు తన వద్దకు రాకపోవడం.. తన డౌట్ ని క్లారిఫై చేయకపోవడంతో సదరు సీనియర్ హీరో మండిపడుతున్నాడట.

ఈ క్రమంలోనే సదరు డైరెక్టర్ ని `ఇడియట్` అంటూ తిటుడుతున్నాడట. ఎంతగా సీనియర్ హీరో తిడుతున్నా.. తనకు సంబంధించిన వాళ్ల ముందు హేళన చేస్తున్నా కూడా సదరు దర్శకుడు పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకుంటూ తన పని తాను చేసుకుపోతుండటం అక్కడున్న వారిని షాక్ కు గురిచేస్తోందని చెబుతున్నారు.