Begin typing your search above and press return to search.

హీరోయిన్ ప‌ర్మిష‌న్ లేకుండా క‌మ‌ల్ లిప్ లాక్

By:  Tupaki Desk   |   24 Feb 2020 11:31 AM GMT
హీరోయిన్ ప‌ర్మిష‌న్ లేకుండా క‌మ‌ల్ లిప్ లాక్
X
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ పేరు మ‌రోసారి వివాదాల్లోకి వ‌చ్చింది. బిగ్ బాస్ హోస్ట్ గా వివాదాలు కొన‌సాగినా అదేమంత స‌మ‌స్యాత్మ‌కం కాదు కానీ.. ఈ వివాదం మాత్రం ఆయ‌న ప‌రువు ప్ర‌తిష్ఠ‌ల‌కు భంగం క‌లిగించేదే. అస‌లింత‌కీ ఏం చేశారాయ‌న? అంటే...

క‌మ‌ల్ ద‌ర్శ‌కుల హీరో. ఆయ‌న‌ ఎలాంటి పాత్ర‌లోనైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌గల న‌టుడు. పాత్ర డిమాండ్ మేర‌కు ఎలాంటి సాహ‌సాలైనా చేయ‌డం అల‌వాటు. 65 ప్ల‌స్ లోనూ క‌మ‌ల్ రొమాన్స్ లో స్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. నేచుర‌ల్ రొమాన్స్ ఆయ‌న స్టైల్. ఆయ‌న‌లో రొమాంటిక్ యాంగిలే తాజాగా వివాదానికి కార‌ణ‌మైంది. బాల‌చంద‌ర్ ప్రియ శిష్యుడిగా కోలీవుడ్ లోకి అడుగు పెట్టిన క‌మ‌ల్ ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ఎన్నో సినిమాలు చేసారు.

అందులో నాటి త‌మిళ హీరోయిన్ తో అనుమ‌తి లేని లిప్ లాక్ హాట్ టాపిక్ అయ్యింది. క‌మ‌ల్- రేఖ జంట‌గా న‌టించిన `పున్న‌గి మ‌న్న‌న్` లో హీరోయిన్ రేఖ‌తో ఓ లిప్ లాక్ సీన్ ఉంటుంది. ఆరోజుల్లోనే ఎలాంటి డూప్ లేకుండా బాల‌చంద‌ర్ హీరో- హీరోయిన్ల మ‌ధ్య ఆ సీన్ చిత్రీక‌రించారు. అయితే ఈ సీన్ గురించి రేఖ‌కు ముందుగా చెప్ప‌లేదుట‌. కేవ‌లం ద‌ర్శ‌కుడు-క‌మ‌ల్ మాత్ర‌మే నిర్ణ‌యించుకుని అప్ప‌టిక‌ప్పుడే యాడ్ చేసేశార‌ట‌. సీన్ డిమాండ్ చేయ‌డంతో రేఖ కూడా అప్ప‌ట్లో ఏమ‌న‌లేక‌పోయారుట‌. సినిమాల్లో ఇలాంటివి కామ‌న్ అని...త‌ర్వాతి రోజుల్లో ముద్దు స‌న్నివేశాలు మరీ స‌హ‌జంగా మారిపోయాయ‌ని చాలా సంద‌ర్భాల్లో ఆమె తెలిపారు.

తాజాగా ఆ ముద్దు విష‌యాన్ని రేఖ వివాదాస్ప‌దంగా మారుస్తున్నారు. ఇది ఓ లైంగిక వేధింపులాంటింద‌ని కామెంట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ముందుగానే త‌న‌కి చెప్పి ఆ సీన్ ని ఫిక్స్ చేసి ఉంటే ఫ‌ర్వాలేదు కానీ త‌న అనుమ‌తి తీసుకోకుండా ఇద్ద‌రు ర‌హ‌స్యంగా ప్లాన్ చేయ‌డం ఏమాత్రం బాగో లేదంటూ అసంతృప్తిని..ఆవేద‌నని వ్య‌క్తం చేసారు. అయితే ఇన్నాళ్లు గుర్తుకురాని ఆ ముద్దు సీన్ గురించి ప్ర‌త్యేకంగా హైలైట్ చేయ‌డం కోలీవుడ్ ని వేడెక్కిస్తుంది. ప్ర‌స్తుతం రేఖ కోలీవుడ్ లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గాను..టీవీ న‌టిగాను కొన‌సాగుతున్నారు.