రోజుకు 3లక్షలు.. అయినా సీనియర్ నటుడికి తీరికేదీ?

Sat Jan 23 2021 10:15:48 GMT+0530 (IST)

Senior Actor Naresh Taking Huge Remueneration

రొటీన్ కి భిన్నంగా ఆలోచించడం .. ఫ్లెక్సిబిలిటీ కొందరికి వరాలుగా మారుతాయి. ఆ కోవకే చెందుతారు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్.. జగపతిబాబు.. సీనియర్ నరేష్. ఈ ముగ్గురూ హీరోలుగా నటించారు. ఒక వేవ్ లా ఏలారు కూడా. కానీ కాలక్రమంలో ఇండస్ట్రీ పొజిషన్ ని బట్టి.. తమ పొజిషనింగ్ ని మార్చుకుని పెద్ద సక్సెసయ్యారు.హీరోగా ఛాన్సులు తగ్గగానే రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్లకు ఒప్పుకోవడంతో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పటికీ ఆయన క్రేజీ చిత్రాల్లో ఇంపార్టెంట్ పాత్రల్ని క్యాచ్ చేస్తూ మెప్పిస్తున్నారు. హీరోగా కొనసాగుతున్న సమయంలోనే సడెన్ గా రూట్ మార్చిన జగపతి విలన్ అయ్యాడు. వరుసగా అగ్ర హీరోల సినిమాల్లో విలనీ చేసి అదరగొట్టాడు. స్టార్ హీరోల సినిమాల్లో మంచి పాత్రల్లోనూ నటించి మెప్పించారు.

ఆ ఇద్దరిలానే సీనియర్ నరేష్ తెలివైన ఎంపికలతో ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్టుగా క్షణం తీరిక లేనంత బిజీ అయిపోయారు. చందమామ కథలు అనే జాతీయ అవార్డ్ సినిమాలో నటించాక అతడికి మరిన్ని అవకాశాలు పెరిగాయి. రీసెంట్ గా ఉమాహేశ్వర ఉగ్రరూపస్య లో ఆయన నటనకు మరింత గా పేరొచ్చింది. ఆ తర్వాత ఫుల్ బిజీ అయిపోయిన పెద్ద నరేశ్ కెరీర్ బెస్ట్ ఫేజ్ లో పరుగులెత్తిస్తున్నారు. రోజుకి మూడు లక్షలు తీసుకుంటున్న సీనియర్ యాక్టర్ గా ఆయన హవా సాగుతోంది. ఇప్పుడు ప్రతి సినిమాలో నరేశ్ కోసం ఓ పాత్రను సృష్టిస్తున్నారు. అయితే ఇటీవల జగపతి బాబు.. రాజేంద్రప్రసాద్ ల హవా కొంచెం తగ్గిందనే చెప్పాలి. కాలంతో పాటే వచ్చే మార్పు ఇది. ఇక సీనియర్ నరేష్ వేవ్ ఎంతవరకూ కంటిన్యూ అవుతుందో.. ఆయన మ్యాజికల్ పవరెంతో చూడాలి.