Begin typing your search above and press return to search.

చంద్ర‌మోహ‌న్ పిల్ల‌ల్ని అందుకే ఇండస్ర్టీకి తీసుకురాలేదా?

By:  Tupaki Desk   |   2 July 2022 11:30 AM GMT
చంద్ర‌మోహ‌న్ పిల్ల‌ల్ని అందుకే ఇండస్ర్టీకి తీసుకురాలేదా?
X
సీనియ‌ర్ న‌టుడు చంద్ర మోహ‌న్ సినీ ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. హీరోగా..న‌టుడిగా..క‌మెడియ‌న్ గా ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పించారు. నేటి త‌రం హీరోల‌తోనూ ఎన్నో సినిమాలు చేసారు. ఇప్ప‌టికీ చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల‌తో పాటు ఎలాంటి చిత్రంలో అవ‌కాశం వ‌చ్చినా న‌టుడిగా త‌న వృత్తికి న్యాయం చేస్తున్నారు.

న‌టుడికి చిన్న సినిమా..పెద్ద సినిమా అనే బేధం లేకుండా చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవ‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా భావించి సినిమాలు చేస్తున్నారు. ఆయ‌నంత పెద్ద‌ న‌టుడు అయినా చంద్ర‌మోహ‌న్ పిల్ల‌లు మాత్రం ఎవ‌రూ మ్యాక‌ప్ వేసుకోలేదు. ఓ ఇంట‌ర్వ్యూలో పిల్ల‌ల్ని సినిమాల్ని ఎందుకు తీసుకురాలేదంటే? ఎన్నో ఆస‌క్తిక‌ర స‌మాధానాలొచ్చాయి. ఆవేంటో అయన మాట‌ల్లోనే తెలుసుకుందాం.

''నాకు ఇద్ద‌రు ఆడ పిల్ల‌లు. ఇద్ద‌రు బాగుంటారు. అందులో చిన్న‌మ్మాయి బాగుంటుంద‌ని భానుమ‌తిగారు ఎప్పుడూ అనేవారు. నేనెప్పుడు ఇంట్లో ఉండేవాడిని కాదు. ఉద‌యం వెళ్తే రాత్రికి రావ‌డం..మ‌ళ్లీ ఉద‌యాన్నే షూటింగ్ కి వెళ్లిపోయేవాడిని. దీంతో పిల్ల‌ల్ని మిస్ అవుతున్నాన‌ని...అప్పుడ‌ప్పుడు పిల్ల‌ల్ని సినిమా సెట్స్ కి నా భార్య తీసుకొచ్చేది.

కానీ వాళ్లు న‌న్ను గెట‌ప్ ల్లో చూసి గుర్తు ప‌ట్టేవారు కాదు. అప్పుడే భానుమతి గారు పిల్ల‌లు బాగున్నారు. చై్డ్ ఆర్టిస్ట్ గా లాంచ్ చేద్దాం అనేవారు. కానీ నేను మాత్రం సినిమా ఇన్ ప్లూయేన్స్ ఏమాత్రం ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డాను. వాళ్ల‌కి యాక్టింగ్ అల‌వాటు ర‌చి చూపిస్తే మ‌ళ్లీ షూటింగ్ ఎప్పుడు? అంటారని భ‌య‌ప‌డి వాళ్ల వ‌ద్ద సినిమా ప్ర‌స్తావ‌న ఎప్పుడూ తీసుకురాలేదు.

చైల్డ్ ఆర్టిస్టులు ఎలా ఉన్నారో? చూస్తూనే ఉన్నాం. నటుల్ని చేయాల‌ని నేనుగానీ..నా భార్య గానీ ఏనాడు అనుకోలేదు. సినిమాల‌కి దూరంగా పెంచాల‌నుకున్నాం. అలాగే పెంచాం. పిల్ల‌లు ఇద్ద‌రు బాగా చ‌ద‌వుకున్నారు. ఇద్ద‌రు గోల్డ్ మెడ‌లిస్ట్ లు. మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసాను.

నేను జాగ్ర‌త్త ప‌రుడుని కాబ‌ట్టే పిల్ల‌ల్ని ఆ స్థాయిలో ఉంచ‌గ‌లిగాను. నేను పిల్ల‌ల ప‌ట్ట అతిగారాబం చూపించి ఉంటే కొంత మంది పిల్ల‌ల్లా చెడిపోయేవారు'' అని అన్నారు.

మీత‌రం వాళ్ల‌లో చాలా మంది చివ‌రి ద‌శ‌కి వ‌చ్చే స‌రికి ఆర్ధికంగా బాగా ఇబ్బంది ప‌డ్డారు? జీవితంలో స‌రిగ్గా స్థిర‌ప‌డ‌లేదు? అవ‌న్నీ చూస్తే మీకు ఏమ‌నిపిస్తుందంటే? చంద్ర‌మోహ‌న్ ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. ఇలాంటి ప్రశ్న‌ల‌కు సమాధానం చెప్పాల‌ని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ల‌కి నా ముందుకు ఈ ప్ర‌శ్న వ‌చ్చింది.

''నేను ఇండ‌స్ర్టీకి వ‌చ్చిన‌ప్ప‌డు కాంతారావు..రాజ‌నాల‌..ముక్కాముల...సూర్యాకాంతం..సావిత్రి.. ఛాయాదేవి...రేలంగి అంతా పుల్ స్వింగ్ లో ఉన్నారు. చాలా బిజీ ఆర్టిస్లులు. రెండు.మూడు కాల్షీట్లు ప‌నిచేస్తుండేవారు. వాళ్లు ఆస్తులు ఏం సంపాదించింద‌రో? తెలియ‌దు గానీ.. అప్ప‌టికి ఫుల్ బిజీ ఆర్టిస్టులు. అప్పుడే వీళ్లంతా సినిమాలు చేసి ఆస్తులు క‌రిగిపోతున్నాయ‌ని వినేవాడిని.

ఘంట‌సాల 'సొంతూరు' సినిమా చేసి బాగా న‌ష్ట‌పోయిన‌ట్లు అప్ప‌ట్లో చెప్పుకునేవారు. ఆ న‌ష్టాల్ని పూరించ‌డానికి మ‌రో సినిమా చేసి ఇంకా అప్పుల పాలయ్యారు. కాంతారావుది అదే ప‌రిస్థితి. ఇక హ‌ర‌నాధ్ లాంటి వాళ్లు విప‌రీతంగా తాగ‌డం..వేశ్య‌ల‌కి అల‌వాటు ప‌డ‌టం..పేక‌ట‌లు..రెండ‌వ పెళ్లిళ్లు ఇలా చాలా మంది వ్య‌స‌నాల‌కు గుర‌వ్వ‌డం చూసాను.

రామ‌కృష్ణ లాంటి వారు జాగ్ర‌త్త ప‌డ‌టం చూసాను. అప్పుడే ఏ జాబితాలో ఉండాలో నిర్ణ‌యించుకున్నా. ఇండస్ర్టీకి వ‌చ్చి స‌క్సెస్ అయి మంచి అవ‌కాశ‌లు ఇచ్చినా కొంత మంది స్వ‌యంకృపారాధంతో పొగొట్టుకున్నారు. నాగ‌భూషణం ఎంత ఆస్తిప‌రుడో స్వ‌యంగా చూసిన‌వాడిని. చివ‌రికి ఔట్ హౌస్ లో గాంధీన‌గ‌ర్ లో ఉన్నాడు.

వీళ్లంతా అలా ఉండ‌టానికి కార‌ణం వాళ్ల పిల్ల‌లకి క్ర‌మ‌శిక్ష‌ణ లేకుండా పోవ‌డం. పిల్ల‌ల ప‌ట్ల అతి గారం అంత‌కు దారి తీసింది. గోల్డ్ స్పూన్ లైప్.. ఖ‌రీదైన కార్లు.. ల‌గ్జీర జీవితాలు చిన్న‌ప్పుడే అల‌వాటు చేసారు. అంతా పండిత పుత్రులే. పిల్ల‌లు సక్ర‌మంగా లేక‌పోవ‌డం వ‌ల్ల చాలా మంది దెబ్బ తిన్నారు. రాజ‌నాల ..హ‌ర‌నాథ్..రంగారావు పిల్ల‌లు అంతే.

వీళ్లంద‌ర్ని చూసే లైమ్ లైట్ లో ఉన్న‌ప్పుడే స్థిర‌ప‌డిపోవాల‌ని డిసైడ్ అయ్యా . అంద‌రూ స‌ముద్రంలో నీరు బిందుతో తీసుకుని వెళ్తే..నేను కనీసం చెంబుతోనైనా తీసుకెళ్లాల‌ని ముందుకెళ్లా. ఆ చెంబుని కూడా ఒలిగిపోకుండా జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి. అలాగ జాగ్ర‌త్త ప‌డి ఇళ్లు..స్థ‌లాలు కొని ఇప్ పు డు సంతోషం గా ఉన్నాను. నేను ఆ ఫెయిల్యూర్ జాబితాలో లేకుండా పోయాను'' అని అన్నారు.