తిరుపతిలో సేనాపతి ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్!

Fri Sep 30 2022 05:00:01 GMT+0530 (India Standard Time)

Senapati flashback episodes in Tirupati!

విశ్వనటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా  శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు-2' షూటింగ్ ఇటీవల  తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తిరుపతి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో కమల్ హాసన్  తో పాటు...కాజల్ అగర్వాల్..ఇతర కీలక పాత్రధారులంతా పాల్గొంటున్నారు. చిత్రీకరణలో భాగంగా సేనాపతి పాత్రకు సంబం ధించిన ప్లాష్ బ్యాక్ ఎపిసొడ్స్ షూట్ చేస్తున్నట్లు తెలిసింది.సినిమాలో ఈ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఊహకందని విధంగా సన్నివేశాలు అద్యంతం రక్తి కట్టిస్తాయని...సేనాపతి పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో తెరపై కనిపించేది కాసేపే అయినా ప్రేక్షకుల్లో ఓ రకమైన ఊపును తీసుకొస్తాయని అంటున్నారు. ఇది భారతీయుడుకి సీక్వెల్ గా   తెరకెక్కుతోన్న చిత్రమన్న సంగతి తెలిసిందే.

అందులో సేనాపతి పాత్రలో కమల్ హాసన్ కనిపిస్తారు. అవినీతి వ్యవస్థ.. లంచగొండులపై  సేనాపతి సమరశంఖం పూరించడం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఒళ్లుజలదరించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.  స్వాతంత్ర్య సమరయోధుడైన సేనాపతి అవినీతి వ్యవస్థపై తిరబడిన సన్నివేశాలు సినిమాను పతాక స్థాయికి తీసుకెళ్తాయి.

వాటిని ఇప్పుడు  ఇండియన్ -2కి  లింకప్ చేస్తూ  నాటి సేనాపతిని తెరపై చూపించబోతున్నట్లు తెలుస్తోంది.ఈ  పాత్ర కోసం కమల్ హాసన్ ఆహార్యం పూర్తిగా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఆ నాటి సేనా పతిని గుర్తు చేయాలంటే?   లుక్ పరంగా చాలా మార్పులు   చేసే ఉండొచ్చు. మరి ఆ లుక్ ఎలా ఉంటుందన్నది స్టిల్స్ రిలీజ్ అయితేగానీ క్లారిటీ రాదు.

ఈ షెడ్యూల్ తిరుపతిలో  కొన్ని రోజుల పాటు ఏకధాటిగా సాగుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. అందుకోసం టీమ్ రేయింబవళ్లు శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే వీలైనంత త్వరగా షూటింగ్ మొత్తం  పూర్తిచేయాలని యూనిట్ కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో వేగంగా షూటింగ్ పూర్తిచేసి తదుపరి పనులు ప్రారంభించాలని టీమ్ భావిస్తుంది.

ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కూడా మరో కథానాయకిగా నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్-రెడ్ జాయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అటు శంకర్ రామ్ చరణ్  సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఒకేసారి రెండు సినిమాల  షూటింగ్ పూర్తి చేయడం శంకర్ కెరీర్ లో ఇదే తొలిసారి. ఇది శంకర్ కి కొత్త రకమైన అనుభవాన్ని ఇస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.