Begin typing your search above and press return to search.

సెల్ఫీ ట్రైలర్ టాక్ : ఈసారి రీమేక్ సెంటిమెంట్‌ బ్రేక్‌ అయ్యేలా ఉంది

By:  Tupaki Desk   |   23 Jan 2023 12:40 PM GMT
సెల్ఫీ ట్రైలర్ టాక్ : ఈసారి రీమేక్ సెంటిమెంట్‌ బ్రేక్‌ అయ్యేలా ఉంది
X
మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన డ్రైవింగ్ లైసెన్స్ ను హిందీలో సెల్ఫీ టైటిల్ తో రీమేక్ చేశారు. ఒక హీరోకు మరియు ఆయన అభిమానికి మధ్య ఈగో క్లాష్‌ వస్తే ఎలా ఉంటుంది.. ఎంత స్టార్‌ అయినా కూడా ఫ్యాన్‌ ప్రభుత్వ అధికారి అయిన సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది డ్రైవింగ్‌ లైసెన్స్ సినిమాలో చాలా ఎమోషనల్‌ గా చూపించారు.

చిన్న చిన్న మార్పులు చేసి హిందీలో డ్రైవింగ్‌ లైసెన్స్ ను సెల్ఫీ గా దించేశారని ట్రైలర్‌ చూస్తూ ఉంటే అర్థం అవుతోంది. ఒరిజినల్‌ సినిమాలో హీరో పాత్రను పృథ్వీరాజ్ సుకుమారన్‌ పోషించిన విషయం తెల్సిందే. ఆ హీరో ఫ్యాన్‌ పాత్రలో సూరజ్ వంజరాముడు నటించాడు. సెల్ఫీ లో హీరో పాత్రను బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్ కుమార్‌ పోషించగా ఫ్యాన్‌ పాత్రలో ఇమ్రాన్‌ హష్మీ పాత్రలో నటించాడు.

ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సెల్ఫీ ట్రైలర్ చూస్తూ ఉంటే పాజిటివ్ వైబ్స్ కలుగుతున్నాయి. హిందీ ప్రేక్షకులు కూడా సెల్ఫీ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నాం అన్నట్లుగా ట్రైలర్‌ కి స్పందిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ లో ఆశించిన స్థాయిలో సక్సెస్‌ సినిమాలు రాలేదు. ఈ సినిమా ఆ సక్సెస్ ను బాలీవుడ్‌ కు ఇస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ఈ మధ్య కాలంలో అక్షయ్‌ కుమార్‌ పలు రీమేక్ ల్లో నటించాడు. హిందీలో సౌత్‌ నుండి పలు సినిమాలు ఉత్తరాదికి రీమేక్ గా వెళ్లాయి. అందులో ఎక్కువ శాతం సినిమాలు నిరాశ పర్చాయి. ఒక్క దృశ్యం 2 సినిమా మినహా చాలా సినిమాలు హిందీ బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.

సెల్ఫీ యొక్క ట్రైలర్‌ ను చూస్తూ ఉంటే రీమేక్ బ్యాడ్‌ సెంటిమెంట్‌ ను బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. డ్రైవింగ్‌ లైసెన్స్ ను ఒరిజినల్ వర్షన్ చూసిన వారు సెల్ఫీ ట్రైలర్‌ చూస్తే ఇంకాస్త బెటర్ గానే సెల్ఫీ మూవీ ఉంటుందేమో అనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ స్థాయిలో సెల్ఫీ సినిమా ఉంటుందా అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.