Begin typing your search above and press return to search.

'ధనుష్ - శేఖర్ కమ్ముల' మూవీలో మరో హీరోకి చోటు.. హీరోయిన్ ఎవరంటే..?

By:  Tupaki Desk   |   18 Jun 2021 7:09 AM GMT
ధనుష్ - శేఖర్ కమ్ముల మూవీలో మరో హీరోకి చోటు.. హీరోయిన్ ఎవరంటే..?
X
నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరో కొత్త ప్రాజెక్ట్‌ అనౌన్సమెంట్ ఇచ్చారు. సున్నితమైన ప్రేమకథలను తనదైన శైలిలో తెరకెక్కించే శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌ పై రూపొందనున్న ఈ చిత్రానికి నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ - రామ్మోహన్‌ రావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఇది త్రిభాషా చిత్రంగా తెలుగు, తమిళం, హిందీలో తెరకెక్కనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. అలా ప్రకటన వచ్చిందో లేదో అప్పుడే ఈ సినిమాకు సంబంధించి అనేక ఊహాగానాలు వస్తున్నాయి.

ధనుష్ నటిస్తున్న ఈ ఫస్ట్ స్ట్రైయిట్ తెలుగు సినిమాలో మరో హీరోకు చోటు ఉంటుందట. అది కూడా మధ్యవయస్కుడు చేయాల్సిన పాత్ర అని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే ఆ పాత్ర కోసం ఏ హీరోని తీసుకుంటారో చూడాలి. అలానే ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుందని మరో వార్త బయటకు వచ్చింది. ధనుష్ - శేఖర్ కమ్ముల ఇద్దరితో వర్క్ చేసిన సాయి పల్లవి.. దక్షిణాది భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఈ క్రమంలో ధనుష్ సినిమాతో బాలీవుడ్ డెబ్యూ చేపిస్తారేమో చూడాలి.

కాగా, శేఖర్ కమ్ముల - ధనుష్ కాంబోలో ప్రాజెక్ట్ ఖరారైందని అధికారిక ప్రకటన వెలువడంతో ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటి వరకు వీరిద్దరి సినిమాలను గమనిస్తే.. ధనుష్ వైవిధ్యభరిత చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్తుంటే.. శేఖర్ కమ్ముల క్లాసిక్ ప్రేమకథలతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల అభిరుచిలో ఇద్దరివీ విభిన్న ధ్రువాలని అనొచ్చు. అలాంటిది ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా వీరి కలయికలో సినిమా రాబోతోంది. అంటే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఓ అరుదైన కాంబినేషన్ ను చూడబోతున్నామన్నమాట. అయితే వీరిద్దరూ కలిసి ఎలాంటి సబ్జెక్ట్ తో రాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అది ధనుష్ స్టైల్ లో ఉంటుందా లేదా శేఖర్ కమ్ముల శైలిలో ఉంటుందా అనేది చూడాలి.