కుళ్లిపోయి కనిపించిన స్టార్ హీరో శవం

Tue Jul 16 2019 12:01:36 GMT+0530 (IST)

మనిషికి ఏ రూపంలో మరణం వస్తుందో ఎవరు చెప్పలేరు. స్టార్స్ నుండి సామాన్యుల వరకు ఎప్పుడో ఒకప్పుడు మృతి చెందాల్సిందే. కాని కొన్ని సార్లు ఆ మృత్యువు అనేది అత్యంత దారుణమైన పరిస్థితుల్లో వస్తుంది. స్టార్స్ గా గుర్తింపు దక్కించుకున్న వారు కూడా కుక్క చావు చావడం మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. తాజాగా హాలీవుడ్ నిన్నటి తరం స్టార్ హీరో చార్లెస్ లెవిన్ కూడా అత్యంత దారుణమైన మరణం పొందాడు. కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన చార్లెస్ లెవిన్ చనిపోయి కుళ్లిపోయిన శవం మాదిరిగా కనిపించాడు.1980 మరియు 90 లలో హాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన నటుడు చార్లెస్. ఈయన ఎన్నో మంచి పాత్రలు పోషించి అమెరికన్ ప్రముఖ నటుల్లో ఒక్కడిగా స్థానం దక్కించుకున్నాడు. వయసు మీద పడటంతో గత కొంత కాలంగా నటనకు దూరంగా ఉంటున్న 70 ఏళ్ల చార్లెస్ కొన్ని రోజుల క్రితం కారులో ఒంటరిగా బయలుజేరి కనిపించకుండా పోయాడు. అప్పటి నుండి కూడా పోలీసులు రెస్క్యూ టీం అంతా కూడా వెదుకుతూనే ఉన్నారు. చార్లెస్ కారుతో పాటు అతడి ఆనవాలు ఏమీ చిక్కక పోవడంతో ఏదైనా ప్రమాదం జరిగిందా అంటూ ఆ కోణంలో కూడా ఎంక్వౌరీ చేశారు. కాని అది కూడా వర్కౌట్ కాలేదు.

ఎట్టకేలకు మొన్న శనివారం కనీసం మనుషులు కూడా వెళ్లలేని ప్రాంతంలో చార్లెస్ మృతదేహం అవశేషాలు కనిపించాయి. దాన్ని చార్లెస్ డెడ్ బాడీగా గుర్తించేందుకు పక్కనే అతడి కుక్క కూడా ఉంది. ఆ ప్రాంతంకు చార్లెస్ ఎందుకు వెళ్లాడు.. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన అక్కడకు వెళ్లి ఉంటాడనే విషయాలపై పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. చార్లెస్ మరణంతో హాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయనతో వర్క్ చేసిన పలువురు స్టార్స్ సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.