Begin typing your search above and press return to search.

థియేటర్లలో 'సీటీ'మార్ అనేస్తున్నారు

By:  Tupaki Desk   |   13 Sep 2021 5:30 AM GMT
థియేటర్లలో సీటీమార్ అనేస్తున్నారు
X
కరోనా కారణంగా దాదాపుగా ఏడాదిన్నర కాలంగా థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ కు నోచుకోవడం లేదు. ఈ ఏడాది ఆరంభంలో కాస్త పర్వాలేదు అనుకుంటున్న సమయంలో సెకండ్‌ వేవ్‌ కారణంగా మూత పడ్డాయి. మొదటి వేవ్ తర్వాత తెలుగు సినిమాకు క్రాక్‌.. ఉప్పెన.. జాతిరత్నాలు సినిమా జోష్‌ ను అందించింది. కాని సెకండ్‌ వేవ్ తర్వాత థియేటర్లు ఓపెన్‌ అయ్యి నెల దాటుతున్నా కూడా ఇంకా జోష్ రాకపోవడంతో ఇండస్ట్రీ వర్గాల వారు కాస్త ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి సమయంలో వచ్చిన సిటీమార్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈమద్య కాలంలో థియేటర్ల వద్ద చూడని క్యూ సిటీమార్ థియేటర్ల వద్ద చూస్తున్నాం. జనాలు సీటీమార్ కు థియేటర్లలో బయట కూడా సీటీ కొడుతున్నారు. గోపీచంద్‌ సుదీర్ఘ కాలం తర్వాత కమర్షియల్‌ బ్రేక్ ను దక్కించుకున్నాడు. ఆయన ఈ సినిమాతో సక్సెస్ దక్కించుకున్న నేపథ్యంలో హీరోగా మరికొంత కాలం కెరీర్ కు ఢోకా లేదని విశ్లేషకులు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో గోపీచంద్‌ కు జోడీగా తమన్నా నటించింది. వీరిద్దరు కూడా కబడ్డీ జట్ల కోచ్ లు గా కనిపించారు. ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్లుగానే నటించారు. గోపీచంద్‌ కు సరి జోడీ అన్నట్లుగా తమన్నా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. సెలవులు ఇతర విషయాల కారణంగా సిటీమార్ కు అతి తక్కువ సమయంలోనే బ్రేక్ ఈవెన్‌ లభించింది అంటూ ట్రేడ్‌ వర్గాల టాక్ వినిపిస్తుంది. సిటీమార్ కు పెద్దగా పోటీ లేకపోవడంతో పాటు వినాయక చవితి సందర్బంగా విడుదల అవ్వడం వల్ల అంతా కూడా సినిమాను ఎంజాయ్‌ చేస్తున్నారు. వీకెండ్స్ లోనే కాకుండా వీక్ డేస్ లో కూడా ఈ సినిమా ఖచ్చితంగా మంచి వసూళ్లతో నడుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. నేటి నుండి సిటీమార్ వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.

సీటీ మార్‌ సినిమా తో పాటు తలైవి సినిమా కూడా విడుదల అయ్యింది. జయలలిత బయోపిక్ అయిన తలైవి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు లో కంగనా రనౌత్‌ కు మంచి అభిమానులే ఉన్నారు. అయినా కూడా తలైవి సినిమా విషయంలో ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తెలుగు వర్షన్‌ తలైవి కి ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు అవ్వడం లేదని టాక్ వినిపిస్తుంది. పెద్ద ఎత్తున సిటీమార్ కుమాత్రమే వసూళ్లు నమోదు అవుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. సిటీమార్ ఇచ్చిన ఉత్సాహం మరియు ఊపుతో వరుసగా టాలీవుడ్‌ లో సినిమాలు విడుదల అవ్వడం ఖాయం. సీటీమార్ సక్సెస్‌ మరియు జనాలు థియేటర్ల వద్ద క్యూలు కట్టడం చూసి నాగచైతన్య లవ్‌ స్టోరీ సినిమాను విడుదలకు రెడీ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. వచ్చే వారంలో లవ్‌ స్టోరీతో చైతూ మరియు సాయి పల్లవిలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.