Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : ఈ అమ్మాయి ఏంటీ ఇలా అయ్యింది

By:  Tupaki Desk   |   17 May 2022 12:30 PM GMT
ఫోటోటాక్ : ఈ అమ్మాయి ఏంటీ ఇలా అయ్యింది
X
రన్ రాజా రన్ సినిమాతో పాటు ఇంకా పలు సినిమాల్లో కనిపించి మెప్పించిన ముద్దుగుమ్మ సీరత్‌ కపూర్. ఈ అమ్మడు రింగుల జుట్టుతో ఆకట్టుకునే రూపంతో సోషల్‌ మీడియాలో కూడా సందడి చేసిన విషయం తెల్సిందే.

అయితే ఈ అమ్మడు ఉన్నట్లుండి కొత్త లుక్ లో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. సీరత్ కపూర్‌ న్యూ లుక్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

బాగా సన్నబడటం తో పాటు ఫేస్ లో కూడా మార్పు వచ్చింది. గతంతో పోల్చితే ఇప్పుడు ఆమె ఆకర్షణ తగ్గినట్లుగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఈ అమ్మాయి ఏంటీ ఇలా తయారయ్యింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మార్పుకు కారణం ఏంటీ అనేది మాత్రం సీరత్ కపూర్‌ సోషల్‌ మీడియా ద్వారా కాని మీడియా ద్వారా కాని క్లారిటీ ఇవ్వలేదు.

హీరోయిన్‌ గా గతంలో ఎంట్రీ ఇచ్చి నోటెడ్‌ అయ్యే విధంగా పాత్రలు చేసింది. కాని అదృష్టం కలిసి రాకపోవడంతో అమ్మడికి ఆఫర్లు పెద్దగా రాలేదు. ఇప్పుడు కాస్త బరువు తగ్గి అందంగా కనిపించడం వల్ల ఈ అమ్మడికి మంచి అవకాశాలు వస్తాయేమో అంటూ కొందరు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

శర్వానంద్‌ హీరోగా నటించిన రాన్ రాజా రన్ సినిమాలో మంచి నటనతో అందంతో ఆకట్టుకున్న సీరత్ కపూర్‌ మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలంటూ ఆమె సన్నిహితులు కోరుకుంటున్నారు.

కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడి సినీ ట్రయల్స్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ న్యూలుక్‌ తో అయినా అమ్మడికి అదృష్టం కలిసి వస్తుందా అనేది చూడాలి.