వార్ బ్యూటీ వాణీ సొగసు చూడతరమా

Thu Apr 22 2021 23:00:01 GMT+0530 (IST)

See the beauty of the War Beauty voice

వార్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులకు సంతకాలు చేసింది వాణీ కపూర్. యష్ రాజ్ ఫిలింస్ లోనే వరుసగా పలు భారీ చిత్రాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ. హిస్టారికల్ కాన్సెప్ట్ ఉన్న మూవీ షంషేరా .. కమర్షియల్ థ్రిల్లర్ బెల్ బాటమ్ లాంటి భారీ చిత్రాల్లో వాణీ నటిస్తోంది. అలాగే `ఛండీఘర్ కరే ఆషికీ` అనే ప్రేమకథా చిత్రంలోనూ ఈ అమ్మడు నాయికగా నటిస్తోంది.వీటన్నిటినీ మించి సోషల్ మీడియాల్లో వాణీ వరుస ఫోటోషూట్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇటీవల ఈ అమ్మడు మరింతగా వేడి పెంచేస్తోంది. తాజాగా వాణీ షేర్ చేసిన ఓ హాట్ ఫోటో యువతరంలో వైరల్ గా మారింది.

ఈ కొత్త లుక్ సంథింగ్ హాట్ అంటూ అభిమానులు రిప్లయ్ లు ఇస్తున్నారు. వైట్ ఫ్యాంట్ .. ఎల్లో బ్రాలెట్ ధరించిన వాణీ నాభి అందాల్ని ఓ రేంజులోనే ఎలివేట్ చేస్తోంది. అయితే వాణీ అన్ లిమిటెడ్ షోస్ తో మరీ ఇంతగా రెచ్చిపోతుంటే కుర్రకారు ఇది తగునా.. తగ్గేదేలే? అంటూ తననే వెంబడిస్తున్నారు. అన్నట్టు తెలుగు స్టార్ డైరెక్టర్లు పూరి జగన్నాథ్.. సుకుమార్ వంటి ప్రముఖులు వాణీ సొగసులకు ఫిదా అయ్యి తదుపరి తమ సినిమాల్లో ఐటెమ్ నంబర్ల కోసం ఈ భామను బరిలో దించే అవకాశం లేకపోలేదని ఊహిస్తున్నారు.