రాజన్న సినిమా చిన్నారి ఇప్పుడు ఎలా అయ్యిందో చూడండి

Tue Jul 20 2021 17:00:01 GMT+0530 (IST)

See how Rajanna movie child artist is now

టాలీవుడ్ లోకి బాల నటిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది చిన్నారి అనీ.. కానీ ప్రస్తుతం ఈమెను చిన్నారి అని పిలవడం బాగుండదేమో. చాలా పెద్దదయి పోయిన అనీ... తాజాగా దిగిన ఫొటోలను చూసిన నెటిజన్లు అంత చిన్న పిల్లలా ఉన్న అనీ ప్రస్తుతం టాప్ హీరోయిన్ లా మారిపోయిందని అంటున్నారు. తన అందంతో నెటిజన్ల చూపును మరల్చకుండా చేస్తుంది. అనీ.. ఈ చిన్నారిది కేరళ కావడం విశేషం. ఇప్పటికే చాలా మంది కేరళ కుట్టీలు మన తెలుగు ఇండస్ర్టీని ఏలుతున్నారు. తమ అందాలతో ఒంపు సొంపుల వయ్యారాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతున్నారు. తాజాగా చైల్డ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని నంది అవార్డు కూడా గెలుచుకున్న అనీది కూడా కేరళనే కావడం విశేషం.ఈ చిన్నారి జగపతి బాబు చార్మి హీరో హీరోయిన్లుగా నటించిన అనగనగా ఒక రోజు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో చిన్న రోల్ చేసింది కానీ అవేవీ తనకు గుర్తింపు తెచ్చిపెట్టలేదు. దర్శక ధీరుడు రాజమౌళి మాస్ మహారాజ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన విక్రమార్కుడు సినిమాలో తాను చేసిన పాత్రతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక అప్పటి నుంచి తాను బాల నటిగా ఫుల్ బిజీ అయిపోయింది. దీంతో అనీ పేరెంట్స్ కూడా హైదరాబాద్ కు మకాం మార్చారు. దర్శకుడు రాజమౌళి ఆ చిన్నారితో ఎప్పటి నుంచో స్పెషల్ క్యారెక్టర్ చేయించాలని భావిస్తూ.. తనకు విక్రమార్కుడు సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. కానీ రాజమౌళి అనుకున్న దాని కంటే అనీ పోలీస్ ఆఫీసర్ కూతురు పాత్రలో ఇరగదీసింది.

ఇక ఈ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ అనీ దశ తిరిగిపోయింది. విక్రమార్కుడు సినిమాలో స్టార్ పర్ఫామెన్స్ చేసిన అనీకి అవకాశాలు క్యూ కట్టాయి. ఇలా అనీ తెలుగులో ఉన్న అందరూ బడా హీరోలతో నటించి మెప్పించింది. అటు తర్వాత ఈ చిన్నారి రాజన్న సినిమాలో చేసిన రోల్ కు నంది అవార్డుకు ఎంపికైంది. ఆ మూవీ హీరో నాగార్జునతో సమానంగా నటనలో ఇరగదీసింది. అందరి చేత ఔరా అని అనిపించుకుంది. కే విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మల్లమ్మగా అనీ చేసిన నటనకు మంచి మార్కులు పడడమే కాకుండా నంది అవార్డును కూడా గెలుచుకుంది.

ప్రస్తుతం ఈ చిన్నారి ఫొటోలు సోషల్ మీడియాలో ముచ్చట గొల్పుతున్నాయి. స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందం తో అనీ అందరి మనసుల్ని ఆకర్షిస్తోంది. ఇన్నాళ్లు బాలనటిగా ఓ వెలుగు వెలిగిన అనీ త్వరలో హీరోయిన్ గా మారుతుంది కావచ్చని ఈ ఫొటోలు చూసిన చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అనీ అంద చందాలు ప్రస్తుత హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు.